వ్యాయామం ముందు......ఏం తినాలి?

వ్యాయామం చేయబోయేముందు కడుపు ఖాళీగా ఉండాలని చాలా మంది అంటుంటారు. పైగా అలా చేయడం అవసరమని నొక్కి చెబుతారు. కానీ నిపుణుల మాట వేరేలా ఉంది. వ్యాయామం ముందు కడుపు ఖాళీగా ఉండటం మంచిదే అయినా... రాత్రంతా నిద్రపోయి ఉండే వ్యవధి ఎక్కువ కావడంతో పరగడపున వ్యాయామం చేశాక కలిగే అలసట తీవ్రంగా ఉంటుంది.

ఒక్కసారిగా నీరసపడిపోతారు. దానికంటే వ్యాయా మం చేయబోయే ముందు కనీసం గంట ముందు ఏదైనా తిని ఆ తర్వాతే చేయడం మంచిది. దాని వల్ల మీ వ్యాయామానికి తగిన శక్తి కూడా లభిస్తుందన్నది ‘మేనేజింగ్ యువర్ మైండ్ అండ్ మూడ్ థ్రూ ఫుడ్’ అనే పుస్తకం రచయిత జూడిత్ జె. వర్ట్‌మాన్ మాట. సరే... మరి ఏం తినాలి? ఏది పడితే అది కాకుండా ఆ టైమ్‌లో పిండిపదార్థాలు ఉండే తేలికపాటి ఆహారం కొద్దిగా తిని అప్పుడు వర్కవుట్స్ చేయాలంటున్నారు.

ఇది ట్రై చేయండి : ఒక కప్పు పెరుగుతో కాస్త అన్నం, లేదా పొట్టు తీయని గోధుమలతో చేసిన రెండు చపాతీలు లేదా ఫుల్కాలతో పాటు చిన్న అరటిపండైతే ఒకటి లేదా పెద్దదైతే అర పండు తినాలి. దాంతో పాటు 150 మి.లీ. ఆరెంజ్ జ్యూస్ తాగిన తర్వాత వర్కవుట్ చేస్తే అది వ్యాయామానికి తగినంత శక్తి ఇస్తుంది. ఇక వ్యాయామం తర్వాత స్నానం చేశాక... అప్పుడు పూర్తిభోజనం... అంటే పిండిపదార్థాలతో పాటు ప్రోటీన్లతో కూడిన ఫుల్ మీల్ తినడం మంచిది. 
Share on Google Plus