ఓసారి ఒక వ్యక్తి తన స్నేహితుడితో కలిసి వేటకెళ్లాడు. అడవంతా వెతికినా ఒక్క జంతువూ కనబడక నీరసపడ్డాడు. ఇంతలో ఒక పొద కదులుతూ కనిపించింది. చూస్తే పులి ఉన్నట్టు అనిపించింది. వెంటనే స్నేహితుడితో... ‘ఒరేయ్, అదిగో పులి, కనిపించిందా’ అన్నాడు హుషారుగా. రెండోవాడు అటు చూశాడు కానీ ఏమీ కనిపించలేదు. అలా చెబితే బాగోదని... ‘అవునవును నిజమే. అదిగో తోక’ అన్నాడు. దాంతో మొదటి వ్యక్తి పులిని వేటాడాలని బాణాలు సంధించాడు. తర్వాత వెళ్లి చూస్తే అక్కడ పులి కాదు కదా, చిన్న జంతువు కూడా లేదు. తోక కనిపించిందన్నావుగా అని అడిగితే, నీకు పులి కనిపించినప్పుడు నాకు కనీసం తోకైనా కనిపించిందని చెప్పకపోతే బాగోదుకదా అని పళ్లికిలించాడు స్నేహితుడు. దాంతో నవ్వలేక ఏడ్చాడా వ్యక్తి. అప్పట్నుంచీ ఈ సామెత వాడుకలోకి వచ్చింది. లేనిదాన్ని ఉన్నట్లు ఎవరైనా ఊహించుకున్నా, దానికి ఇంకో రెండు మాటలు కలిపి ఇంకెవరైనా చెప్పినా ఈ సామెత వాడతారు.
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు...
teluguLifestyle Editor
12:27:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.