మిమ్మల్ని మొలలు బాధిస్తున్నాయా?

నిత్యం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాల శాతం తగ్గడం వలన మలబద్ధకం కలుగుతుంది. మలవిసర్జన కష్టంగా మారుతుంది. మలవిసర్జన సాఫీగా జరగనప్పుడు గట్టిగా ముక్కడం వల్ల మలాశయం వద్ద ఉండే కండరాలు, రక్తనాళాలు ఒత్తిడికి గురెై ఉబ్బుతాయి. కొన్ని సందర్భాల్లో రక్తస్రావం కూడా జరుగుతుం టుంది. పెైల్స్‌ని (హిమరాయిడ్స్‌)లను ‘అర్షమొలలు’ అంటారు . పెైల్స్‌ అంటే గడ్డ అని హిమరాయిడ్‌ అంటే రక్తస్రావం కావడం అని అర్థం. మొలలు చూడటానికి పిలక లుగా కనిపించి, రక్తంతో ఉబ్బి ఉంటాయి. ఇవి మల ద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా కనిపిస్తాయి. అర్షమొలలు (పెైల్స్‌) ముఖ్యంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. వీటిలో ఒక రకం పెైల్స్‌ మలద్వారం లోపలే ఉండి బయటికి కనిపించకుండా ఉంటాయి. ఇలా పెైల్స్‌ మలద్వారం లోపల ఉండటం వల్ల రోగికి పెైల్స్‌ ఉన్న విషయం చాలా రోజుల వరకు తెలియకుండా ఉంటుంది.

ఇక రెండో రకం పెైల్స్‌ మలద్వారానికి వెలుపలే ఉంటాయి. ఇవి చేతికి తాకుతుంటాయి. మల విజర్జనకు వెళ్ళినప్పుడు కొన్ని రకాల మొలలు నొప్పి కలిగిస్తాయి. అర్షమొలలు లోపలికిపోతునానయి కదా అని అజాగ్రత్తతో మందులు వాడకుండా, డాక్టర్‌ సలహా తీసుకోకుండా ఉంటే కొన్ని రోజులకు మొలలు మలద్వారం బయట ఎక్కువ సంఖ్యలో తయారెై, శాశ్వతంగా బయటనే ఉండిపోయి తీవ్రమైన అవస్థలకు గురిచేస్తుంది.
కారణాలు: తీవ్రమైన మానసిక ఒత్తిళ్ళు, మలవిసర్జన సక్రమంగా జరగక మలబద్ధకం తోడవడంతో కొందరిలో వంశపారంపర్యంగా ఎక్కువసేపు కుర్చీ లో కూర్చొని కదలకుండా విధులను నిర్వర్తించడం వలన, తక్కువగా నీరు తాగడం వల్ల, మద్యం అతిగా సేవించడం వల్ల, ఫాస్ట్‌ఫుడ్స్‌, వేపుళ్ళు అతిగా తినడం వల్ల, మాంసాహారం తరచుగా తినడం వల్ల పెైల్స్‌ సమస్య వస్తుంది.

లక్షణాలు: విసర్జన సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి, మంట ఉంటుంది. మనుషులు చురుకుగా ఉండలేరు. ఎక్కడికంటే అక్కడికి ప్రయాణాలు చేయలేరు. విరోచనం కాకపోవడం వీరికి బాధ కలిగిస్తుంది. సుఖ విరోచనం కాకపోవడంతో చిరాకుగా కోపంగా ఉంటారు. అప్పుడప్పుడు విరోచనంలో రక్తం పడుతుంటుంది. మలవిసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి, మంట రెండు గంటల వరకు ఉంటుంది. మల విసర్జన సమయంలో మొలలు (పెైల్స్‌) బయటకు పొడుచుకొన్ని వచ్చి బాధిస్తాయి.

జాగ్రత్తలు: సులభంగా జీర్ణమయ్యే ఆహారపదార్ధాలు తీసుకోవడం, ఘనపదార్థాలకన్నా ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవటానికి ప్రయత్నించాలి. కారం, నూనె, మసాలా పదార్థాలు బాగా తగ్గించాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4 నుంచి 5 లీటర్లు). ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు మలవిసర్జన సాఫీగా జరుగినట్లు చూసుకోవాలి. మద్యం అతిగా సేవించడం, మాంసాహారం, చిరుతిండ్లు మానుకోవాలి. మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్‌ లాంటివి చేయాలి.

చికిత్స: వెంటనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. మలం మృదువుగా ఉండేలా, సులభంగా విసర్జితమయ్యేలా ఆకు కూరలు, తాజాపండ్లు, పీచు పదార్ధాలున్న ఆహారం తీపుకోవాలి. క్రమబద్ధంగా ఒకేవేళలో మలవిసర్జనానికి వెళ్ళే విధంగా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలతో పాటు నొప్పి నివారణకు మందులు, ఆయింట్‌మెంట్స్‌, విసర్జన తేలిగ్గా జరిగే మందులు ఉపయోగించాలి. కొన్ని మందులు మొలల సైజ్‌ను తగ్గించి, నొప్పి, రక్తస్రావాన్ని తగ్గిస్తాయి. డాక్టర్‌ సలహా మీద అవసరమైతే మొలలకు శస్త్ర చికిత్స చేయించుకోవాలి, లేకపోతే బాధతో పాటు రక్తస్రావం జరుగుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top