పాపడ్ కబాబ్

కావలసినవి:
మసాలా పాపడ్ - 6
కాటేజ్ చీజ్ - 50 గ్రా.
ఉల్లిపాయతరుగు - 2 టేబుల్ స్పూన్లు
క్యాప్సికమ్ తరుగు - టేబుల్ స్పూను
కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు
నూనె - వేయించడానికి తగినంత
చీజ్ - 25 గ్రా
యాలకుల  పొడి - చిటికెడు

తయారు చేసే విధానం

ఒక గిన్నెలో ఉల్లిముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కాటేజ్ చీజ్, చాట్ మసాలా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపాలి. చీజ్‌ను తురిమి పై మిశ్రమంలో కలపాలి. పాపడ్స్‌ని నీళ్లలో వేసి వెంటనే బయటకు తీయాలి. మెత్తగా అయిన పాపడ్‌లో చీజ్ మిశ్రమాన్ని పెట్టి రోల్ చేసి, రెండు వైపులా మూయాలి. బాణలిలో  నూనె పోసి, వేడెక్కిన తర్వాత పాపడ్ రోల్స్‌ను వేసి రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు  వేగించి , బయటకు తీయాలి.వేడి వేడిగా, గ్రీన్ చట్నీతో ఈ పాపడ్ కబాబ్స్‌ను సర్వ్ చేయాలి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top