కొలస్ట్రాల్ స్థాయిలు తగ్గటానికి...కీరదోస

మనం సలాడ్స్ తీసుకున్నప్పుడు వాటిలో కీరా దోస ముక్కలు ఉంటున్నాయా లేదా అనే విషయాన్ని గమనించారా? ఎందుకంటే కీరా దోస మనకు చాలా సహాయపడుతుంది.

కీరదోసలో దాదాపుగా 95 శాతం నీరు ఉంటుంది. వీటిని తరచుగా తీసుకుంటే డై హైడ్రేషన్ సమస్య ఉండదు. అంతేకాక శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను బయటకు పంపుతుంది. కీరదోసలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన మన శరీరానికి అవసరమైన విటమిన్ సి అందుతుంది. అయితే కీరదోసను చెక్కు తీయకుండా తీసుకోవాలి. 

దీనిలో కేలరీలు తక్కువగా నీటి శాతం ఎక్కువగా ఉండుట వలన బరువు తగ్గాలని అనుకొనే వారికి బాగా సహాయం చేస్తుంది. కీరదోసలో పీచు ఎక్కువగా ఉండుట వలన మలబద్దకం సమస్యతో బాధపడే వారు ప్రతి రోజు ఒక గ్లాస్ కీరా రసం త్రాగితే మంచి ఫలితం కనపడుతుంది. 


కీరదోసలో మెగ్నీషియం, పొటాషియం,పీచు సమృద్ధిగా ఉండుట వలన కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించటమే కాకుండా అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. 

కీరదోసలో ఉన్న సిలికా కీళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. పైగా విటమిన్ ఎ,బి1,బి6,సి,డి విటమిన్స్,పోలేట్స్, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. దీన్ని క్యారట్ తో కలిపి జ్యూస్ గా చేసుకొని త్రాగితే కీళ్ళకు చాలా మంచిది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top