పండ్లు పళ్లకు హాని చేస్తాయా?

పండ్లు తినడం ద్వారా పంటిపై ప్లేక్‌ పేరుకుపోయి ఇనామెల్‌ పాడవుతుందని నిపుణులు చెప్పుతున్నారు. ముఖ్యంగా యాపిల్స్‌ మన పళ్లకు చాలా హాని చేస్తాయని చెప్పుతున్నారు. దంత సమస్యల్లో పండ్ల రసాల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

మీ పళ్లు బలంగా ఉంటేనే దేనిని అయినా కరకరా నమిలేయగలరు. అదే దంత సమస్యలు ఉన్నప్పుడు .. ఏది నోట్లో పెట్టుకోవాలన్నా భయమేస్తుంది. మరి, పళ్లు గట్టిగా ఉండాలంటే..రోజుకి రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి. అయితే అలా బ్రష్ చేసుకొనేవారు చాలా తక్కువ.

ఉదయం ఒకసారి,రాత్రి పడుకొనే ముందు ఒకసారి తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే పళ్లకు బలం కలుగుతుంది.

చాలామంది రాత్రిపూట టీవీలు వీక్షిస్తూనో, ఇంటర్‌నెట్‌ బ్రౌజ్‌ చేస్తూనో చాక్లెట్లు తినేస్తుంటారు. ఎన్ని తిన్నామన్న లెక్క కూడా ఉండదు. ఆ తరువాత అలాగే పడుకుంటారు. ఇలా చేస్తే పళ్లు పాడవుతాయి. తిన్న తరువాత కనీసం ఒక గ్లాసు మంచి నీళ్లతో నోరు పుక్కిలించడం మరువొద్దు.

కాల్షియం కలిగిన పండ్లు ఆరోగ్యానికే కాదు. పళ్లకు కూడా బలవర్ధకమైన ఆహారం. తరచూ వాటిని తింటే.. పైపళ్లు, కిందిపళ్లు బలంగా తయారవుతాయి.



కొందరైతే నెలల తరబడి టూత్‌బ్ర్‌షను మార్చరు. కనీసం రెండు మాసాలకు ఒకసారైన బ్రష్‌ను మారిస్తేనే ఉత్తమం. మీ పళ్లకు సరిపడే బ్రష్‌ను కొనుగోలు చేయండి. కుటుంబ సభ్యులందరు ఒకే రకమైన బ్రష్‌లు కాకుండా.. ఎవరికి ఏది సరిపడుతుందో దాన్నే తీసుకోండి. కొన్ని బ్రష్‌లు సాఫ్ట్‌గా, మరికొన్ని హార్డ్‌గా ఉంటాయి.

హోటళ్లకు వెళ్లినప్పుడు వేడి వేడి పదార్థాలు తిన్న వెంటనే చల్లటి పదార్థాలు తింటుంటారు. ఇలా చేస్తే పళ్లపైన ఉండే ఎనామిల్‌ దెబ్బతింటుంది. తద్వార హాని తలెత్తుతుంది.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top