పిల్లల్లో ఏడుపు మన్పించాలంటే ఏమి చేయాలి?

పిల్లలు ఏడవటం అనేది సర్వ సాదారణం. అదేమీ వ్యాధి కాదు. కానీ కొంత మంది తల్లులు మాత్రం పిల్లలు ఏడుస్తూ ఉంటే తెగ కంగారు పడుతూ ఉంటారు. తల్లి ఎందుకు కంగారు పడుతుందో బిడ్డకు తెలియకపోయినా తల్లి హవాబావాలను బట్టి మరింత పెద్ద రాగం తీస్తాడు. 

ప్రతి దానికి పిల్లలలో ఏడవటం మన్పించకపోతే అది వారు పెరిగి పెద్దవారైన తర్వాత వారి శారీరక,మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆరోగ్య సమస్య కాకుండా వేరే ఏదైనా కారణం చేత పిల్లలు ఏడుస్తుంటే వారిని మన్పించటానికి కొన్ని చిట్కాలు......

* పిల్లలు దేని కోసం ఏడుస్తున్నారో తల్లి గమనించాలి. కొన్ని సార్లు పిల్లలు ఆకలి వేసి కూడా ఏడుస్తారు. ముందుగా వారి అవసరాలను తీరిస్తే పిల్లలు వారి అంతటా వారే ఏడుపు మానివేస్తారు.

* పిల్లలు ఏదో ఒక వస్తువు కావాలని మారం చేస్తూ ఉంటే అలాంటి ఏడుపును అసలు పట్టించుకోకండి. కొద్ది సేపు వారి వంక చూడకుండా ఉంటే వారి అంతటా వారేఏడుపు మానివేసే అవకాశం ఉంది. 

When Your Baby Won't Stop Crying

* అలా కాకుండా వారు అడిగిన ప్రతి వస్తువును ఇస్తూ ఉంటే వారికీ అదే అలవాటు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే చిన్నవయస్సులో పిల్లలు తమ పంతం నేగ్గించుకోవటానికి ఏడుస్తూ ఉంటే అప్పుడే అడ్డుకట్ట వేయండి.

* పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో వారి నోటి ద్వారానే చెప్పనివ్వండి. పిల్లలను అడిగే విషయంలో ఏ మాత్రం కోపం,తొందర ప్రదర్శించకుండా శాంతముగా,ప్రశాంతముగా వారిని అడిగి చూడండి. సాదారణంగా పిల్లలు ఏడుస్తూ ఉంటే,మీరుఅడిగిన వెంటనే వారు సమాదానం చెప్పకపోవచ్చు. ఒకటి రెండు సార్లు ఓపికగా అడిగి వారి నుంచి సమాదానం రాబట్టటానికి ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో వారు మర్చిపోవచ్చు. సమస్యను క్రమంగా అర్ధం చేసుకుంటారు.

* పిల్లలు ఏడవటం మొదలు పెట్టగానే వారికీ నచ్చిన పాటలు పాడటమో లేదా పాటలు పెట్టటం చేయండి. వారు ఆ పాటలను వింటూ ఏడుపును మర్చిపోతారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top