జీరో సైజ్ (అతి తక్కువ బరువు) అనేది గర్భదారణకు అడ్డంకా?

స్త్రీలలో చాలా మంది తమ అధిక బరువును తగ్గించుకొనే క్రమంలో జీరో సైజ్(అతి తక్కువ బరువు)కి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆరోగ్యపరంగా ఊబకాయం కన్నా ఈ జీరో సైజ్ అతి ప్రమాదకరమైనదని నిపుణులు చెప్పుతున్నారు. ముఖ్యంగా వీరు గర్భం దాల్చే విషయంలోనూ, ఆ తర్వాత కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. 


ఊబకాయం ఉన్న వారిలో కన్నా వీరిలో గర్భం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ విషయం మీద చికాగోలోని అడ్వాన్స్ ఫెర్టిలిటి సెంటర్ వారు ఎనిమిది సంవత్సరాల పాటు సుమారు 2500 మంది మహిళల మీద పరిశోదనలు నిర్వహించారు. పరిశోదనల అనంతరం వారు ఈ విషయాన్నీ నిర్దారించారు.


Zero Weight Gain During Pregnancy in telugu

మహిళలను మూడు గ్రూపులుగా విభజించారు. సాదారణ బరువు గల స్త్రీలు,అధిక బరువు గల స్త్రీలు,అతి తక్కువ బరువు గల స్త్రీలుగా విభజించారు. మూడు గ్రూపుల మహిళల్లో ఒకేసారి అండం విడుదల అయ్యి గర్భం దాల్చిన,జీరో సైజ్ మహిళల్లో మాత్రం కొన్ని మార్పులను కనుగొన్నారు. గర్భం దాల్చిన అనంతరం మిగతా రెండు గ్రూపుల కన్నా జీరో సైజ్ వారి విషయంలో కొన్ని ఆరోగ్య సమస్యలను గుర్తించారు.


వీరి గర్భసంచి ఆరోగ్యంగా లేకపోవటం కూడా వీరి దృష్టికి వచ్చింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని జీరో సైజ్ వారు గర్భం దాల్చే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారని నిర్దారించారు. వైద్యుల సలహా మేరకు వారి పరిరక్షణలో మాత్రమే అధిక బరువును నియంత్రించుకోవాలి. 

ముఖ్యంగా టినేజర్స్ బరువు తగ్గించుకొనే విషయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. శరీర ఆకృతి నాజుకుగా ఉంచుకోవాలని అనుకోవటం ముఖ్యమే కానీ,అతి పనికిరాదని నిపుణులు సూచిస్తున్నారు.


Share on Google Plus