అందమైన చర్మం కోసం....కొబ్బరినూనె

చాలా మంది కొబ్బరినూనెను శిరోజాల సంరక్షణకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ దీనిలో చర్మ సంరక్షణ లాభాలు బోలెడు దాగి ఉన్నాయని చెప్పవచ్చు. శరీరంలో చర్మమే అతి పెద్ద అవయవము. దీని ఆరోగ్యం మీదే శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. 


సూర్య కిరణాల ప్రభావానికి చర్మం త్వరగా దెబ్బతింటుంది. అలా దెబ్బతినకుండా చర్మాన్ని ఎప్పటికి అందంగా మరియు ఆరోగ్యంగా ఉంచే శక్తి కొబ్బరినూనెకు ఉంది. కొబ్బరినూనె వాడటం వలన కలిగే లాభాలు,ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాము.


జిడ్డు,పొడి చర్మం కల వారు కూడా కొబ్బరినూనెను ఉపయోగించవచ్చు. మిగతా నూనెల కన్నా కొబ్బరి నూనె తొందరగా చర్మం లోకి ఇంకిపోతుంది. ఒక్కసారి కొబ్బరినూనెతో చర్మాన్ని సున్నితంగా మర్దనా చేసుకుంటే కొన్ని గంటల వరకు చర్మం పొడిబారకుండా ఉంటుంది.


యాంటి ఫంగల్,యాంటి బ్యాక్టిరియాల్,యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఉండుట వలన చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. మేకప్ తీసి వేయటానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. చర్మంలోని ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ సౌందర్యం దెబ్బతింటుంది. ఈ ప్రమాదం నుండి కొబ్బరినూనెలో ఉన్న యాంటి ఆక్సిడెంట్స్ కాపాడతాయి. 


చర్మం మీద పుండ్లు,గాయాలను మాన్పే శక్తి కొబ్బరినూనెకు ఉంది.వయస్సు ప్రభావం కారణంగా వచ్చే ముడతలు,మచ్చలు నివారిస్తుంది.

ఎలా వాడాలంటే.....
స్నానానికి ముందు కొబ్బరినూనెను శరీరానికి పట్టించి ఓ పావుగంట పాటు వదిలివేయాలి. అనంతరం గోరువెచ్చని నీటితో సబ్బు ఉపయోగించకుండా,శనగపిండితో స్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేసినట్లతే చర్మ ఆరోగ్యంతో పాటు,సహజసిద్దమైన నిగారింపును, మెరుపును సొంతం చేసుకోవచ్చు.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top