అమల గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు

టాలీవుడ్ కింగ్ నాగార్జున భార్య అమల చాలా సున్నిత మనస్సు కలిగిన మహిళ. అంత పెద్ద హోదా ఉండి కూడా ఒక సామాన్యురాలిగానే జనాల్లోకి వస్తారు. మూగ జీవాల సంరక్షణలో ఆమె ఎప్పుడు ముందు ఉంటారు. సినిమాల్లో మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం చక్కని ఇల్లాలిగా,గొప్ప తల్లిగా బాద్యతలు నిర్వహిస్తున్నారు. 

CLICKHERE : గారెలూ, బూరెలూ ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే....

అమల తల్లి ఐర్లాండ్ దేశస్తురాలు. తండ్రి బాంగ్లాదేశ్ కి చెందిన వారు. వారిద్దరిది ప్రేమ వివాహం. బాంగ్లాదేశ్ విడిపోయాక వీరు పశ్చిమ బెంగాల్ లో స్థిరపడ్డారు. అమల కలకత్తాలో పెరిగారు. ఆమెకు 8 సంవత్సరాల వయస్సు ఉన్నప్ప్పుడే క్లాసికల్ డాన్స్ మీద ఇష్టం ఏర్పడింది. ఆమె రుక్మిణి అయ్యంగార్ స్థాపించిన ఇనిస్టిట్యూట్ లో భరతనాట్యం నేర్చుకుంది.

CLICKHERE : తట్టుకోలేని కడుపు మంట వస్తుందా?? సెకండ్లలో తగ్గించే టెక్నిక్…

13 సంవత్సరాల వయస్సులోనే ప్రదర్శనలు ఇవవటం ప్రారంభించింది. ఇండియాతో పాటు విదేశాల్లో కూడా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. దర్శకుడు రాజేందర్ తన సినిమాలో క్లాసికల్ డాన్సర్ కోసం వెతుకుతూ ఉంటే అమల కన్పించారు. ఆమె నృత్య ప్రదర్శనలు నచ్చటంతో వెంటనే మైత్రేయి అనే సినిమాలో అవకాశం ఇచ్చారు.

CLICKHERE : బుల్లి తెరను హీటెక్కిస్తున్న హాట్ యాంకర్స్

ఆలా సినిమాల్లోకి వచ్చిన అమల 5 భాషల్లో సినిమాలు చేసారు. 'కిరాయి దాదా' సినిమాతో అక్కినేని నాగార్జునతో తొలిసారి కలిసి నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత చిన బాబు,శివ, ప్రేమయుద్ధం,నిర్ణయం వంటి సినిమాలు నాగార్జునతో చేసింది. 1991 లో మనం పెళ్లి చేసుకుందామని నాగార్జున అడగటంతో అమల ఆశ్చర్యపోయింది.

CLICKHERE : పెయిన్ కిల్లర్ కాంబిఫ్లేమ్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

ఆ తర్వాత ఇద్దరు ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్నాక 1992 లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారిద్దరి ప్రేమకు ప్రతిరూపం అఖిల్. అప్పటి నుంచి తన సమయాన్ని అంతా బాబును,ఇంటిని చూసుకోవటానికే కేటాయించింది. పెళ్లి అయ్యాక వెండితెరకు దూరం అయిన అమల బుల్లితెరపై కన్పించారు. తమిళంలో సూపర్ మామ్ పోటీకి జడ్జ్ గా వ్యవహరించారు. పెళ్లి అయ్యిన తర్వాత 20 సంవత్సరాల వరకు సినిమాల వైపు చూడలేదు.

CLICKHERE : సౌందర్యతో ఎఫైర్ పై జగపతి బాబు హాట్ కామెంట్స్

2012 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో మళ్ళీ వెండితెరపై కన్పించారు. నాగార్జున సలహాతో మూగ జీవాల సంరక్షణ కోసం బ్ల్యూ క్రాస్ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా మూగ జీవాలను సంరక్షించారు. ప్రస్తుతం ఆమె అన్నపూర్ణ ఇంటర్ నేషనల్ స్కూల్ అఫ్ ఫిలిం అండ్ మీడియా భాద్యతలను ప్రర్యవేక్షిస్తున్నారు.

CLICKHERE : హీరో విక్రమ్ అలవాట్లు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

CLICKHERE : ఉదయం 9 గంటల లోపు మీరు చేసే 9 తప్పులు

Share on Google Plus