సెహ్వాగ్‌కు ట్విట్టర్ ద్వారా వచ్చే ఆదాయం ఎంతో తెలిస్తే షాకే?

డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ అకౌంట్‌కు 80 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్విట్టర్ ‌స్టార్‌గా అతను సంపాదించుకున్న అభిమానం వెనుకే ధనప్రవాహం వచ్చి చేరింది. గత ఆరు నెలల్లో ట్విట్టర్ల ద్వారా 30 లక్షల రూపాయలు సంపాదించానని సెహ్వాగే స్వయంగా వెల్లడించాడు. ‘‘నా పోస్టులు వేలాదిగా రీట్వీట్ అయ్యాయి. ఇంకా పెద్ద సంఖ్యలో షేర్ అయ్యాయి. స్పాన్సర్ల నుంచి డబ్బు రావడం మొదలైంది’’ అని వీరూ చెప్పుకొచ్చాడు. అతని ట్వీట్లలో తమ బ్రాండ్ పేరును ఎక్కడో అక్కడ చొప్పించమంటూ స్పాన్సర్లు అతన్ని సంప్రదిస్తున్నారు.


CLICKHERE : జియోకి పోటిగా ఇతర కంపెనీలు ప్రకటించిన అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ఇవే!

ఉదాహరణకు చూడండి.. ‘‘హాజ్మే కీ గోలీ.. రంగోం కీ హోలీ.. గుజరాత్ మే ఘాగ్రా చోలీ ఔర్ బ్యాటింగ్ మే విరాట్ కోహ్లి పూరే ఇండియా కో పసంద్ హై.. హ్యాపీ బర్త్ డే విరాట్’’ అనే ట్వీట్. ఇలా కొన్ని కంపెనీలకు తెలివిగా ప్రచారం చేస్తున్నాడు వీరూ. రాయల్టీగా వచ్చే డబ్బు వీరూకి అవసరమే. హర్యానాలో గురుగ్రామ్-ఝాజ్జర్ హైవేపై తన స్వగ్రామానికి చేరువలో 40 ఎకరాల స్థలంలో 2011 నుంచి అన్ని క్రీడా సదుపాయాలతో లాభాపేక్ష లేకుండా సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూలు నిర్వహిస్తున్నాడు. చిన్నప్పుడు తమ గ్రామంలో పాఠశాల లేక కష్టపడిన రోజులు, ఓ స్కూలు స్థాపించమని తండ్రి చెప్పిన మాటలు అతనికి గుర్తున్నాయి.
Share on Google Plus