కొంగ ఎందుకు ఒంటికాలిపై నిలబడుతుందో తెలుసా?


కొంగ ఒంటికాలిపై నిలబడుతుందనే విషయం మనకు తెలిసిందే. చేపల కోసం అలా దొంగ జపం చేస్తుందని అందరూ దాన్ని ఎద్దేవా కూడా చేస్తుంటారు. అయితే దాని ఒంటి కాలి జపం వెనుక ఒక కారణముంది. అదేమిటంటే కొంగ చల్లని నీళ్లల్లో నిలబడినపుడు ఆ చల్లదనం నుంచి రక్షణ కోసం దాని కాళ్లలో రక్తప్రసరణ ఎక్కువ ఉండాలి.

అంటే గుండె వేగంగా కొట్టుకోవాలి. అది కొంగకు ఇబ్బందికరం. అదే ఒంటికాలిపై నిలబడితే ఆ ఒత్తిడి సగం తగ్గుతుంది. ఒంటికాలితో నిలబడటం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రతను 50 శాతం వరకూ నియంత్రించుకోగలుగుతుంది కూడా.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top