నాగార్జున ఫోన్ నెంబర్ మార్చడం వెనక కరం తెలిస్తే షాక్


సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన అక్కినేని నాగార్జున పేరే వినిపిస్తోంది. ఒక ప్రక్కన “ఓం నమో వెంకటేశాయా” పెద్ద డిసాస్టర్ కావడం మరో ప్రక్కన అఖిల్ పెళ్లి క్యాన్సిల్ కావడం ఇప్పుడు ఈ రెండు నాగార్జునను ఇరకాటంలో పడేశాయి. అయితే నాగార్జున జరుగుతున్న వాటి గురించి పట్టించుకోకుండా “రాజుగారి గది 2” సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటే.. ఇప్పుడు తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

ఒక సినిమా ఫ్లాప్ అయిందని మన హీరోలు ఎప్పుడు బాధపడరు... ఇక్కడ అసలు విషయం ఏంటంటే అఖిల్ పెళ్లి రద్దు విషయంలో నాగార్జునకు అందరూ కాల్ చేసి తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారట. అందుకే ఈ కారణం వల్ల నాగార్జున తన ఫోన్ నెంబర్ మార్చేశాడని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిలో నిజం ఏంటో తెలియదు గానీ కొడుకు పెళ్లి రద్దు అయినప్పుడు ఏ తండ్రికైనా బాధగా ఉంటుంది. ఒంటరిగా ఉంచకుండా ఇలా విసిగిస్తే ఎవరికైనా చిరాకు వస్తుంది కదా. ఇకపోతే అఖిల్ మరియు శ్రియ పెళ్లి తర్వాత విడిపోయే బదులు ఇప్పుడు విడిపోవడమే మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ మేటర్ ఇంతటితో వదిలేస్తే అందరికి మంచిదే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top