శని గ్రహాన్ని అనుకూలంగా చేసుకోవడం ఎలా?


గ్రహాల స్థితిగతులనుబట్టి మన జాతకచక్రం నడుస్తుంటుంది. కనుక నవగ్రహాలను అనుకూలంగా చేసుకోవడం చాలా అవసరం. అందులో శని ప్రభావం మరీ ఎక్కువ కనుక, శని దోషం ఉన్నవారు కొన్ని దానాలు ఇవ్వడం ద్వారా దాన్ని శాంతింపచేసుకోవచ్చు.

CLICKHERE : థైరాయిడ్ సమస్యకు రోజూ రెండు స్పూన్ల తేనెతో ఇలా చెక్ పెట్టొచ్చు!!
శని మహర్దశలో చేయవలసిన దానములు

1. శని మహర్దశ, శని అంతర్దశల్లో నువ్వులు దానము చేయాలి.
2. శని మహర్దశ, రవి అంతర్దశలో ఒక గుమ్మడికాయను, ఇవ్వగలిగినంత బంగారాన్ని దానం చేయాలి.
3. శని మహర్దశ, చంద్రుని అంతర్దశలో తెల్ల ఆవును దానం చేయాలి.
4. శని మహర్దశ, కుజ అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.
5. శని మహర్దశ, బుధుడు అంతర్దశలో దున్నను దానం చేయాలి.
6. శని మహర్దశ, గురుడు అంతర్దశలో బంగారు మేకను దానం చేయాలి.
7. శని మహర్దశ, శుక్రుడు అంతర్దశలో నల్ల మేక, నువ్వులు, ఇనుము, లవణం, నూనెలను దానం చేయాలి.
8. శని మహర్దశ, రాహువు అంతర్దశలో సీసమును దానం చేయాలి.
9. శని మహర్దశ, కేతువు అంతర్దశలో బంగారం, నువ్వులు దానం చేయాలి.

CLICKHERE : చెరుకు రసం కొందరు తాగకూడదు.. ఎవరు, ఎందుకో తెలుసా?


వివిధ గ్రహాల శని అంతర్దశలో చేయవలసిన దానములు:

1. రవి మహర్దశలో మేకను దానం చేయాలి.
2. చంద్రుని మహర్దశ, శని అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.
3. కుజ మహర్దశ, శని అంతర్దశలో నువ్వుల పిండిని దానం చేయాలి.
4. బుధుని మహర్దశ, శని అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.
5. గురుని మహర్దశ, శని అంతర్దశలో నల్లమేకను దానం చేయాలి.
6. శుక్రుని మహర్దశ, శని అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.
7. రాహువు మహర్దశ, శని అంతర్దశలో నల్లమేకను దానం చేయాలి.
8. కేతు మహర్దశ, శని అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.

పైన సూచించినవి ఏవైనా దొరకనప్పుడు వాటికి బదులుగా ధనమిచ్చుటకన్నా సూచించిన దాని ఆకారంలో వెండితో ప్రతిమ చేయించి దక్షిణతో కలిసి ఇవ్వాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top