కాటమరాయుడు కలెక్షన్స్ కి భారీ దెబ్బ కొట్టిన కేసీయార్ మనవడు


కాటమరాయుడు కలెక్షన్స్ కి కేసీయార్ మనవడు దెబ్బ కొట్టటం ఏమిటా అని ఆలోచిస్తున్నారా? ఇది నిజమే ఇప్పటికే భారీగా పడిపోయిన కాటమరాయుడు కలెక్షన్స్ కి తెలంగాణ సీఎం కేసీయార్ మనవడు, ఐటి శాఖ మంత్రి కెటియార్ కొడుకు హిమాంశు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవటంతో కలెక్షన్స్ కి గండి పడే అవకాశము ఉంది.

అసలు విషయంలోకి వెళ్ళితే...హైదరాబాద్ లో జరుగుతున్న సౌత్ ఇండియా సినిమా అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీయార్ తో పాటు మనవడు హిమాంశ్ కూడా పాల్గొన్నాడు. కేసీయార్ మనవడు ఒక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ కాటమరాయుడు సినిమా చూశానని అంత ఎక్కువగా ఏమి లేదని నార్మల్ గా ఉందని చెప్పాడు. ఈ వీడియో ను నెటిజన్స్ పేస్ బుక్,ట్విట్టర్ లలో షేర్ చేయటం ప్రారంభించారు. దాంతో ఈ ప్రభావం కాటమరాయుడు సినిమాపై పడే ప్రమాదం ఉందని అంటున్నారు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top