శ్రీరామనవమి కి వడపప్పు - పానకం ఎందుకు తీసుకోవాలి ?


మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా,ఆయా ఋతువులను ,దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే . వడపప్పు - పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని
దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చేగొంతువ్యాధులకు... పానకంలో ఉపయోగించే మిరియాలు,ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని చెబుతారు. పానకం విష్ణువుకి
ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక.

CLICKHERE : రోజుకి కోటి రూపాయలు సంపాదిస్తున్న పవన్.... నిజమా...???


పెసరపప్పును 'వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో 'వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.అందుకని
ఒక్క శ్రీరామనవమి రోజు నే కాకుండా ఈ వేసవి లో వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది .
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top