ప్రపంచంలో పర్యటక ప్రదేశాలను సందర్శించి, అక్కడి విశేషాలను ‘థర్డ్ హోం’ పోర్టల్‌తో పంచుకోవాలి. ఇందుకు ఇంగ్లీష్‌లో నైపుణ్యం, క్రియేటివ్ ఆలోచనలు ఉంటే చాలు, ఈ ఆఫర్ మిమ్మల్ని సులభంగా వరిస్తుంది. మూడు నెలల కాంట్రాక్ట్ కాలంలో కనీసం 12 ప్రాంతాలను సందర్శించి, వాటి వివరాలను పంచుకోవాలి. 18 ఏళ్ల వయస్సు దాటిన ఎవరైనా దీనికి అర్హులే. ఇంకా చెప్పాలంటే..
టూరిస్టు ప్రాంతాలు తిరిగేందుకు మీ ట్రావెలింగ్, ఫుడ్, బెడ్ అన్ని ఖర్చులనూ థర్డ్ హోం సంస్థనే చెల్లిస్తుంది. మూడు నెలల వ్యవధిలో మీరు 12 లగ్జరీ హోటళ్లలో బస చేసే అవకాశం కల్పిస్తుంది. మీకు వచ్చే జీతంలో పైసా కూడా ట్రావెలింగ్ కోసం ఖర్చు చేయక్కర్లేదు. అయితే, మూడు నెలల తర్వాత పరిస్థితి ఏమిటని ఆలోచిస్తున్నారా? మీ పనితనం నచ్చితే, సంస్థ మిమ్మల్ని కోరి మరీ కొనసాగిస్తుంది. మీ పనితనం అద్భుతంగా ఉంటే శాలరీ కూడా భారీగానే ఇస్తుంది. ఇందుకోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేయమని సూచించింది థర్డ్ హోం..

