చైనీస్ సూప్ కి ఆకలిని పెంచే శక్తి ఉందా?

క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు ఆకలిని పెంచే సూప్ ని సూచిస్తున్నారు. అయితే ఈ సూప్ ఇప్పుడు కనుగున్నది మాత్రం కాదు. చైనాలో పూర్వం నుండి సంప్రదాయబద్దంగా పన్నెండు రకాల మూలికలతో తయారుచేసే రెన్ షేన్ యంగ్రాంగ్ టాంగ్ అనే సూప్క్యా న్సర్ వ్యాధిగ్రస్తులలో ఆకలిని పెంచటానికి ఉపయోగపడుతుందని బీజింగ్ కి చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సూప్ ను క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు క్రమం తప్పకుండా ఇచ్చి వారిలో ఆకలి,జీర్ణ శక్తి తీరును పరిశీలన చేసారు. 

సూప్ త్రాగిన వారిలో ఆకలి మాములుగా వేయటంతో పాటు జీర్ణ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తున్నట్టు వీరి పరిశోదనలో తేలింది. మాములుగా క్యాన్సర్ వ్యాధి గ్రస్తుల్లో క్రమేపి ఆకలి మందగించటం అనేది వారి చికిత్సకు అడ్డంకిగా నిలుస్తుందని, అయితే ఈ సూప్ త్రాగటం వలన ఆకలి క్రమేపి పెరిగి చికిత్సకు సహాయకారిగా ఉంటుందని అంటున్నారు. 

ఈ సూప్ ను రెండు నుంచు మూడు వారాల పాటు రోజుకు రెండు సార్లు త్రాగితే మంచి పలితం కనపడుతుందని పరిశోదకులు అంటున్నారు.అయితే ఇది క్యాన్సర్ ని తగ్గించే మందుగా మాత్రం పనిచేయదని కూడా చెప్పుతున్నారు. కానీ ఈ సూప్ అందరికి అందుబాటులోకి రావాలంటే కొంత సమయం పడుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top