ముఖం ఉబ్బినప్పుడు...... పరిష్కార మార్గాలు

ఒక్కోసారి ఉన్నట్టుండి ముఖం ఉబ్బిపోతుంది. అద్దంలో చూసుకుంటే ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇంట్లోనే చేసుకొనే కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి.

శరీరంలో తేమ శాతం తగ్గినప్పుడు ముఖం ఉబ్బుతుంది. అలాంటి సమస్య తరచూ వస్తుంటే నీరు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. అలాగే వంటల్లో ఉప్పు శాతాన్ని తగ్గించాలి. ఒక్కోసారి తీవ్రమైన ఆందోళనకు గురి అయినప్పుడు ముఖం వాచిపోతుంది. శరీరానికి విటమిన్స్,మినరల్స్ ఎంత ఎక్కువగా అందితే అంత త్వరగా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. దాని కోసం ముదురు ఆకుపచ్చని కురలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.

ప్రతి రోజు వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయటం కుదరపోతే ఇంటి పనులు చేస్తూనే శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. అలాగే కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచి తీసిన పాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. ఈ విధంగా చేయుట వలన వాపు, నొప్పి తగ్గుతాయి. అలాగే ముఖం మీద ఉన్న మురికి కూడా తొలగిపోతుంది.

కొందరికి పడుకొనే తీరులో తేడా వచ్చినా ముఖం ఉబ్బుతుంది. ఎత్తు మీద పడుకోవటం, పడుకున్నప్పటి నుండి లేచే వరకు ఒకేలా ఉండటం వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. తరచూ ధ్యానం చేయుట వలన ఇటువంటి సమస్యల నుండి బయట పడవచ్చు.
Share on Google Plus