శీతాకాల వ్యాధులు - చికిత్స


శీతాకాలం అనగానే చలిపులి వణికిస్తుంది. దీనివలన కొన్ని రకాల శారీరక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ అనేది ఎక్కువ ప్రభావం చూపుతుంది. సిఓపిడి వ్యాధి, చికిత్స విధానాలను గురించి...
సిఓపిడి అంటే ఏమిటి?
క్రానిక్‌ ఆబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌. ఊపిరితిత్తులలో కొంత అవరోధాన్ని కలిగించే ఈ వ్యాధికై దీర్ఘ కాలిక చికిత్స అవసరం. ఈ అవరోధం ఊపిరితిత్తులలోనికి, బయటకు గాలిని సరఫరా చేసే వాయు నాళాలలో ఏర్పడుతుంది. కొందరిలో వాయునాళాలు సన్నబడతాయి అంచేత వాటిగుండా వెళ్లగల గాలికూడా తగ్గిపోతుంది. ఇంకా, గాలి ఊ పిరితిత్తుల ద్వారా బైటకు సరిగా వెళ్లలేదు. ఈ కారణంగా, ఊపిరితిత్తులు బరువుగానూ, ఛాతీ పట్టేసినట్లుగానూ ఉండి, శ్వాస ఆడనట్లు అనిపిస్తుంది.
  • సిఓపిడి క్రిముల వల్ల సంక్రమించేది కాదు. అంచేత ఒకరి నుంచి మరొకరికి సిఓపిడి వ్యాపించదు.
  • పిల్లలకు సిఓపిడిరాదు. సాధారణగా సిఓపిడి వచ్చేవారు 40 ఏళ్లకు పై బడినవారే అయి ఉంటారు. కానీ ఒక్కోసారి 40 ఏళ్లకు లోబడి ఉన్నా రావచ్చు. ముఖ్యంగా పొగ తాగేవారైతే వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.
  • సిఓపిడి రావడానికి పొగతాగడం బీడీలు, సిగరేట్లు, హుక్కా పీల్చడం అన్నిటికన్నా ముఖ్య కారణం. చాలామంది సిఓపిడి ఉన్నవారు ప్రస్తుతం అ అలవాటును మానుకున్నా ఇప్పటికే వారి ఊపిరితిత్తులకు నష్టం వాటిల్లి ఉంటుంది.
  • ఒక్కొక్కప్పుడు, పొగతాగని వాళ్లకు కూడా సిఓపిడి రావచ్చు. వాళ్లు కనక తమ ఊపిరితిత్తులకు నష్టం కలిగించే వాతావరణంలో ఉంటే కనుక; ఉదాహరణకి వంటపొయ్యిలు (ఛూలాలు, కుంపట్లు) నుండి లేదా గదిని వెచ్చ బరిచేందుకు పెట్టుకున్న హీటర్లు( సిగ్రీ) నుంచి వచ్చే పొగలు పీలుస్తూ ఉంటే సిఓపిడి రావచ్చు.
  • అంతేకాకుండా, బొగ్గుగనులు, సిమెంట్‌, టెక్స్‌టైల్స్‌, రసాయనాలు, అభరణాలకు పూసే (ఎక్ట్రో ప్లేటింగ్‌) పరిశ్రమల వంటి దుమ్ముతో కూడుకున్న గాలి ఉన్న చోట్ల పొగ లేదా ప్రదూషితమైన చోట్ల చాలాకాలం పనిచేసిన వ్యక్తులకు కూడా ఈ వ్యాధి వస్తుంది.
  • అస్తమా(ఉబ్బసం) ఉన్న వ్యక్తులలో అందుకు చికిత్స జరగకపోతే కూడా వారికి సిఓపిడి రావచ్చు.
    ఊపరితిత్తులలో ఏమైంది?
  • ఊపిరి తిత్తులు ఎలా పనిచేస్తాయో తెలిస్తే ఎవరి స్థితిని గురించి వారు మరింత అవగాహన చేసుకుంటారు.
  • గాలి పీల్చినపుడు గాలి నాళాల్లో ఉండే వాయు మార్గాల గుండా ఊపిరి తిత్తుల్లోకి పోతుంది. ఈ నాళాలు గాలిని ముక్కు, నోరు నుంచి ఊపిరితిత్తుల్లోకి తీసుకు పోతాయి. సిఓపిడి వచ్చినపుడు ఊపిరితిత్తుల్లోని వాయు మార్గాలు కుంచించుకుపోతాయి. వీటి ద్వారా ప్రసరించగల గాలి మొత్తం తక్కువౌతుంది. అంచేత అది ఊపిరితిత్తుల నుంచి సరిగ్గా బయటకు రాలేక నిండుగా ఉన్నట్టు ఉంటుంది. వీటినే సిఓపిడి లక్షణాలంటారు.
    ఎంత ప్రభావితులయ్యారో ఎలా నుగొనడం?
  • ఇటివలే సిఓపిడి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్షం చేయరాదు. ఎంత తొందరగా చికిత్స ప్రారంభించగలిగితే సిఓపిడిని అంతా తొందరగా అదుపులో పెట్టడం వీలవుతుంది.
  • డాక్టర్‌ శ్వాస తీసుకోవడంలో గల కష్టాలను గురించి, ఇంటిగురించి, పనిచేసే ప్రదేశాల గురించి అడుగుతారు.
  • సై్పరోమీటర్‌ అన్న పరికరం ద్వారా వ్యాధి లక్షణాలు కనిపించినవారికి కొన్ని శ్వాసపరీక్షలు చేయవలసి ఉంటుంది. సిఓపిడి తక్కువైనదా (మైల్డ్‌) ఓ మోస్తరుదా(మోడరేట్‌), విపరీతమైనదా(సివియర్‌) అనేది కనుక్కునేందుకు ఈ పరీక్షలు పనికొస్తాయి.
    తక్కువ సిఓపిడి లక్షణాలు
  • ఎక్కువగా దగ్గుతూ ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు దగ్గులో శ్లేష్మం కూడా రావచ్చు.
  • గట్టిగా పనిచేస్తే లేదా త్వరగా నడిస్తే మీకు ఊపరి తగ్గినట్లు అనిపించవచ్చు.
    ఓ మోస్తారు సిఓపిడి లక్షణాలు
  • మరింతగా దగ్గుతూ ఉండవచ్చు. దగ్గులో శ్లేష్మం కూడా రావచ్చు.
  • కాస్త గట్టిగా పనిచేస్తే లేదా త్వరగా నడిస్తే ఊపిరి తగ్గినట్లు అనిపించవచ్చు.
  • శారీరకమైన పని లేదా ఇంటిపనులు చేస్తూ ఉన్నప్పుడు కష్టం అనిపిస్తూ ఉండచ్చు. మిగతావారికంటే పనులన్నీ కాస్త మెల్లగా చేయవలసి రావచ్చు.
  • జలుబు, ఛాతీ ఇన్‌ఫెక్షన్‌ల నుండి కోలుకోవడానికి చాలా వారాలు పట్టచ్చు.
    విపరీతమైన సిఓపిడి లక్షణాలు
  • మరింత బాగా దగ్గుతూ ఉండవచ్చు. దగ్గులో విపరీతంగా శ్లేష్మం కూడా రావచ్చు.
  • పగలూ రాత్రీ కూడా ఊపిరి పీల్చడంలో కష్టం కలుగుతూ ఉండచ్చు.
  • జలుబు, ఛాతీ ఇన్‌ఫెక్షన్‌ల నుంచి కోలుకోవడానికి చాలా వారాలు పట్టవచ్చు.
  • ఏ మాత్రం పనికి వెళ్లరాదు. ఇంటి పనులు చేయరాదు
  • మెట్లు ఎక్కలేరు. ఓ గదిలో ఈ మూల నుంచి అ మూలకు కూడా సరిగా నడవలేరు.
  • ఎంత కొంచెం పనిచేసినా లేదా కాస్త విశ్రాంతి తీసుకున్నా కూడా అలసిపోతూ ఉంటారు.
    సిఓపిడి చికిత్స విధానాలు
  • పొగతాగేవారు అయితే దానిని మానాలి.
  • రోజుకు రెండు సిగరేట్లు తాగుతూ ఉన్నా పరిస్థితి మరింత వేగంగా దిగజారిపోతుంది. సిగరేట్ల పొగ ఊపిరితిత్తులని ప్రకోపించి వాయు నాళాలని కుచించుకుపోయేట్లు చేస్తుంది. తద్వారా మరింత ఎక్కువ శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది వాటిని మూసేస్తుంది. పొగతాగడం వల్ల రక్తంలో గల శరీరానికి అత్యావశ్యకమైన ఆక్సిజన్‌ని ప్రసరణ చేసే శక్తిని తగ్గిస్తుంది.
  • మనోబలం అంతగొప్పది కాదని అనిపిస్తే డాక్టర్‌ సలహా అడగాలి. పొగ మానడానికి మాత్రలు తీసుకోవచ్చు.
  • సిగరేట్‌ తాగాలని కోరిక కలిగితే చూయింగ్‌గమ్‌ నమలండి. తాజా పళ్లను లేదా కాయగూలను తినండి. ప్రతిరోజూ ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి.
  • మళ్లీ పొగతాగడం ప్రారంభిస్తే లక్ష్యాన్ని మాత్రం వదులుకోవద్దు. మళ్లీ మానేయడానికి ప్రయత్నించాలి.
    డాక్టర్‌ సలహాపాటించండి 
  • డాక్టర్‌ చెప్పిన తేదీలలో పరీక్షలకు వెళ్లాలి. డాక్టర్ని సంవత్సరంలో రెండుసార్లైనా కలుసుకోవాలి.
  • తీసుకుంటున్న మందుపేరు, తీసుకోవలసిన మోతాదు. ఎప్పుడు తీసు కోవాలి అనేవి రాసి ఉంచుకోవాలి.
  • వాయునాళాలను వెడల్పు చేసే మందులను బ్రోంకో డైలేటర్స్‌ అంటారు. ఊపిరితిత్తులలో గల వాయునాళాల చుట్టూ ఉన్న చిన్న కండడాలను గట్టిపరిచే చర్యను అధిరోహించి ఇంకా వెనక్కు మరలించడం ద్వారా ఈ మందులు పనిచేస్తాయి. ఈ విధంగా ఇవి మీ లక్షణాలకు ఉపశమనం కల్పిస్తాయి. తద్వారా మీరు మరింత కులాసాగా శ్వాస తీసుకోవడానికి తోడ్పడుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top