Telugu Funny Jokes - 6

సెకండ్ షో
‘మా ఆవిడ ఈ మధ్య అబద్ధాలు చెబుతోందిరా’ స్నేహితుడితో చెప్పాడు ప్రకాష్.
‘ఏం, చీరలూ నగలూ కొని రేట్లు ఎక్కువ’ తక్కువ చెబుతోందా?
‘కాదు, రాత్రి ఒంటిగంటకు ఇంటికి వచ్చి, వాళ్ల ఫ్రెండ్ సునీతతో కలిసి సెకండ్‌షోకు వెళ్లానని చెప్పింది’.
‘వెళ్లిందేమో...’
‘కాదురా... సునీతతో సెకండ్‌షోకి నేను వెళ్లా’ అసలు విషయం చెప్పాడు ప్రకాశ్.
బయటి ప్రమాదం
మురారి : మొన్న మెషీన్‌లోపడి వేళ్లు చితికాయి కదా సార్. డాక్టర్ దగ్గరకు వెళ్తే చాలా ఖర్చయింది. ఆ బిల్లు కాస్త మీరే ఇప్పించాలి.
బాస్ : అలాగే
మురారి : సర్, నాకు కాస్త జీతం పెంచాలి.
బాస్ : ఎందుకూ...?
మురారి : అదికాదు సర్, నేను పెళ్లి చేసుకోబోతున్నాను.
బాస్ : ‘చూడు బాబూ, ఆఫీసు బయట జరిగే ప్రమాదాలకు మా బాధ్యత ఉండదు’ 

ఇక చదవొచ్చు
పల్లెటూరు నుంచి పట్నం వచ్చి కళ్లు చూపించుకున్నాడు గోవిందు.
‘‘డాక్టర్ నేను కళ్లజోడు పెట్టుకుంటే ఏమైనా చదవగలనా?’’ ఆశగా అడిగాడు గోవిందు.
‘‘చదవగలరు’’ చెప్పాడు డాక్టర్.
‘‘హమ్మయ్య! ఇన్నాళ్లూ చదువు రాదనే బాధ నన్ను పీడిస్తుండేది. ఇక ఆ బాధ లేదన్నమాట’’ ఆఁఁఁఁ......
రూపాయి
కామాక్షమ్మ ఆటోలో ఇల్లు చేరుకున్నాక మీటర్ చూసి పర్సులో నుండి డబ్బు తీయబోయింది. అయితే ఓ రూపాయి తక్కువయ్యేసరికి మళ్లీ ఆటోలో కూలబడి ‘‘ఓ ఫర్లాంగు దూరం వెనక్కుపోనీ నాయనా! డబ్బు తక్కువయింది’’ అంది అమాయకంగా.

మిస్టర్ భోగారావ్
భిక్షకుడు భోగారావు ఇంటింటికీ తిరిగి తన ఐడీ కార్డులు పంచుతున్నాడు.
ఇదేంటో అర్థం కాక ఒకావిడ ‘ఏంటి నాయనా ఇవి’ అని అడిగింది.
‘ఇవి నా కార్డులమ్మా, ఇందులో నా ఫోన్ నెంబరూ, నాకు నచ్చే కూరల లిస్టూ ఉంది. ఈ మధ్య కొంతమంది... నేను వేళకాని వేళలో వస్తున్నానని ఆడిపోసుకుంటున్నారు. ఇక మీదట అలాంటి నిందలు పడదల్చుకోలేదు. ఈ కార్డులో నా నంబర్ ఉంది. దీనికి మిస్డ్ కాల్ ఇస్తే చాలు, నేను మీ ఇంటి ముందు ప్రత్యక్షమయిపోతా’ వివరంగా చెప్పాడు భోగారావు.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top