ఆధునిక జీవనశైలి సమస్య... స్థూలకాయం

21వ శతాబ్దపు అతిపెద్ద సమస్య స్థూలకాయం. వివిధ వ్యాధులు చుట్టు ముట్టడానికి ఒక ముఖ్యమైన కారణం అవడమే కాకుండా అనవసరమైన మరణాలకు రెండవ ప్రధాన కారణమవుతోంది.
           అధిక బరువును కలిగి ఉండటం అంటే స్ర్తీ అయినా పురుషుడైనా వారి వయసుకు, ఎత్తు కు తగ్గట్టుగా ఉండవలసిన బరువుకన్నా అధికంగా ఉండడం. అధిక బరువు అనేది సాధారణంగా స్థూలకాయం వల్లే వచ్చినా అసహజ రీతిలో కండరాలు పెరగడం లేదా ద్రవా లు నిలిచిపోవడం వల్ల కూడా రావచ్చు. కొవ్వు కణాలు విస్తరించినా లేదా కొవ్వుగల కణజాలం అసహజంగా పెరిగినా లేదా వాటి సంఖ్య రెట్టింపు అయినా లేదా ఈ రెండు చోటు చేసుకోవడాన్ని స్థూలకాయంగా అభివర్ణించవచ్చు. దీనిని ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌’ (బిఎంఐ) ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా పురుషులలో 30 కన్నా స్ర్తీలలో 28.6 కన్నా బిఎంఐ అధికంగా ఉన్నప్పుడు స్థూలకాయ సూచనలు ఉన్నట్టే.


బిఎంఐ:
ఒక వ్యక్తి అధిక బరువును కలిగి ఉన్నాడా అనేది నిర్ధారించేందుకు ఉపయోగించే గణనే బాడీ మాస్‌ ఇండెక్స్‌. ఒక వ్యక్తి బరువును కిలోలలో, ఎత్తును మీటర్లలో తీసుకొని దానిని భాగాహరించి, ఎంత సంఖ్య వస్తే అంతటితోనే హెచ్చింపు చేసి అంతి మంగా వచ్చే సంఖ్య ద్వారా నిర్ధారిస్తారు.
వివిధ బరువులు ఉన్న వారిలో బిఎంఐ.. వర్గీకరణ:
1. తక్కువ బరువు - 18.5
2. సాధారణ బరువు - 18.5 - 24.9
3. అధిక బరువు - 25.0
4. ప్రీ- ఒబేస్‌ - 25-29.9
5. ఒబేస్‌ క్లాస్‌ -1 - 30.0 - 34.9
6. ఒబేస్‌ క్లాస్‌ -2 - 35.0- 39.9
7. ఒబేస్‌ క్లాస్‌ - 3 - 40.0
కారణాలు:

ఇందుకు ఏ ఒక్క కారణమని నిర్ధిష్టంగా చెప్పలేం. దీర్ఘ కాలం పాటు అనేక కారణాలు కలిసి పనిచేయడం ఫలితంగా ఇది సంభవిస్తుంది. 

గుర్తించిన కొన్ని సాధారణ కారణాలు :

వయసు- అది ఏ వయసు అయినా కావచ్చు అయితే వయసుతో పాటు స్థూలకాయం వచ్చే అవకాశాలపెరుగుతాయి.
జెండర్‌- పురుషులు 29-34 సంవత్సరాల మధ్య అధిక బరువు పెరుగుతారని కనుగొనగా స్ర్తీలు 45-49 ఏళ్ళ మధ్య బరువు పెరుగుతారు. భౌతిక శ్రమ లేక పోవడం. సామాజిక, ఆర్ధిక కారణాలు - ఎక్కువగా సంపన్న దేశాలలో కనుపిస్తుంది.
ఆహారపు అలవాట్లు - 

  •  భోజనానికి మధ్య తినడం.
  •   ఎక్కువగా తినడం.
  • భారీగా తినడం.
  • స్వీట్లు.
  •   రిఫైన్డ్‌ పదార్ధాలు తీసుకోవడం. 
  •  టిన్డ్‌, కాన్డ్‌ పదార్ధాలను, డ్రింక్స్‌ను తీసుకోవడం.
  •   చిల్డ్‌ ఫుడ్స్‌, డ్రింక్స్‌.
  •   నూనె పదార్ధాలు, వేపుళ్ళు వగైరా. 
  • కొత్త బియ్యం, పప్పులు.
  •   తాజా వైన్‌
  •   పాల పదార్ధాలు. 
  •  బేకరీ ఉత్పత్తులు.
  • మాంసాహారం.
పగటి పూట నిద్రించడం సౌకర్యవంతమైన పడక. ఇతర కారణాలలో అవిద్య, చైతన్యం లేకపోవడం, ఆహారంలో ఉండే కేలరీలు, అవి తీసుకునే విషయంలో అజ్ఞానం. 

చికిత్స

 


ఒబేసిటీకి కేవలం ఒకటే పరిష్కారం లేదు. అనేక ప్రక్రియలను సమాంతరంగా చేపడుతూ వాటిని సమన్వయం చేయడం ద్వారానే దానిని నియం త్రించవచ్చు. ఒబేసిటీ  ని నియంత్రించేందుకు వివిధ రకాలైన, ప్రతిభావంతమైన చికిత్సలు ఉన్నాయి. అవి:
తీ డైట్‌ థెరపీ తీ భౌతిక వ్యాయామం తీ ప్రవర్తనకు సంబంధించిన థెరపీ తీ డ్రగ్‌ థెరపీ తీ కంబైన్డ్‌ థెరపీ తీ శస్త్ర చికిత్స.
మందులతో చేసే చికిత్సను బిఎమ్‌ఐ 30.0 నుంచి 27.0 వరకు ఉండి ఒకటి లేదా రెండు ఒబేసిటీకి సంబంధించిన లక్షణాలు కలిగి ఉంటే చేస్తారు. దానిని బరువు తగ్గించి, తగు బరువును మెయింటైన్‌ చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఇది జీవన శైలిలో కొన్ని మార్పులతోనే సాధ్యమవుతుంది.
సాధారణంగా ఉపయోగించే మందులు:
1. నవక గుగ్గులు
2. కాంచనార గుగ్గులు 
3. శిలాజీత్‌ 
4. చంద్రప్రభా వటి
5. లోహ భస్మ 
6. త్రిఫల
మూలికలు: 

1. వెల్లుల్లి
2. అల్లం 
3. పసుపు 
4. గుగ్గులు
5. కరక్కాయ
6. కొత్తిమీర 
7. త్రకటు
8. ఉసిరికాయ
9. పంచకోల 
10. శొంఠి 
11. ఆవాలు
 12. జీలకర్ర 
13. మిరియాలు.
ఆహారం: 

1. మామిడి
2. అనాస
3. బొప్పాయ
4. పుచ్చకాయ
5. ఓట్‌మీల్‌
5. ద్రాక్షలు
7. దంపుడు బియ్యం
8. బక్‌ వీట్‌
9. పచ్చటి కూరగాయలు.


వ్యాయామం:
1. రోజుకి 45 నిమిషాల పాటు బ్రిస్క్‌ వాకింగ్‌. 
2. ఎయిరోబిక్స్‌ 
3. సైక్లింగ్‌
4. స్విమ్మింగ్‌
యోగా: 

అనులోమ, ప్రతిలోమ, కపాలభాతి ప్రాణాయామం.
కౌన్సెలింగ్‌:

చికిత్సలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఒబేసిటీవల్ల కలిగే ఒత్తి డి, సామాజిక హేళన వం టి వాటి నుంచి రోగి బయటపడేందుకు ఇది ఉపయోగపడుతుంది. వ్యాధిగ్రస్థుడు స్వయం నియం త్రణను వృద్ధి చేసుకొని, తన కార్యకలాపాలను క్రమబద్ధం చేసుకునేందుకు సాయపడుతుంది. 


స్థూలకాయాన్ని నియంత్రించేం దుకు ఆయుర్వేద చిట్కాలు
1. అతి నిద్రను నివారించాలి
2. పాలు, పెరుగు, నూనె పదార్ధాలు,
ఫాస్ట్‌ ఫుడ్స్‌ తీసుకోవడం మానేయాలి
3. భోజనం చేసిన వెంటనే నీరు
తాగడం మానాలి
4. పెరుగు మీద తేట, పల్చటి మజ్జిగ
స్థూలకాయాన్ని నియంత్రించడంలో
సాయపడతాయి.
5. పళ్ళు, పండ్ల రసాలు ఎక్కువ తీసుకోవాలి. పుచ్చకాయ ఎంతో మంచిది.
6. ఆకు కూరలు అధికంగా తీసుకోవాలి

7. పాలు తీసుకోవాలనుకునే పక్షంలో టోన్డ్‌ మిల్క్‌ తీసుకోవాలి
8. గోరువెచ్చటి నీరు తాగుతుండాలి.
9. వెన్న, చీజ్‌ వంటి పదార్ధాలు తీసుకోవడం మానేయాలి.
10. మాంసాహారానికి దూరంగా ఉండాలి
12. అన్నం, ఆలు గడ్డ సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి
13. రోజూ క్యారెట్‌ జ్యూస్‌ తాగడం మంచిది
14. శొంఠి, దాల్చిన చెక్క, మిరియాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి
15. పుదీన చాలా మంచిది. రోజూ పుదీన ఆకు ఆహారంలో తీసుకోవాలి.
16. ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలి.
17. కాబేజీని పచ్చిగానైనా, వండినదైనా ఎక్కువగా తీసుకోవాలి.

18. కూరగాయల సలాడ్లను తీసుకోవడం మంచిది.
19. ఒక భాగం గోధుమలు, 1/10 భాగాలు సెనగలు, 1/10 భాగం సోయా పిండి, 1/10 బార్లీ, 1/10 జొన్న పిండి కలిపి చపాతీలు చేసి తీసుకోవాలి. ఇది శరీరానికీ బలాన్నీ ఇస్తుంది. బరువు అతిగా పెరగకుండా నిరోధిస్తుంది.
20. స్థూలకాయానికి అతి మంచి వం టింటి చిట్కా తేనె. ఒక టేబుల్‌ స్పూన్‌ తాజా తేనెను ఒక టీ స్పూన్‌ నిమ్మరసం ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపున తీసుకోవాలి. రోజులో అనేకసార్లు దీనిని తీసుకోవచ్చు.
21. అన్నింటిలోకీ నడక ఉత్తమ వ్యాయామం. దానితో ప్రారంభించి రన్నిం గ్‌, స్విమ్మింగ్‌, రోయింగ్‌ చేయవచ్చు.

22. చక్కెర, మైదా పదార్ధాలను సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి.
23. భోజనానికి మధ్యలో చిరుతిళ్ళు, టీవీ చూస్తూ తినడం మానుకోవాలి
24. బేకరీ ఉత్పత్తులను సాధ్యమైనంత వరకూ తీసుకోరాదు.
25. ఆల్కహాల్‌ను, పెప్సీ, కోలా, కోక్‌ వంటి ఎయిరేటెడ్‌ డ్రింకులను తీసుకోవడం మానేయాలి.
గమనిక: 

ఈ వ్యాసం ఉద్దేశం ఒక వ్యాధి లేదా ఒక స్థితి గురించి చైతన్యం కలిగించడానికే తప్ప స్వయం చికిత్సను, ఔషధ సేవనాన్ని ప్రోత్సహించేందుకు కాదు. మందులు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఎందుకంటే అనేక సమస్యలను మందుల అవసరం లేకుండానే జీవన శైలిలో మార్పులతో దూరం చేయవచ్చు. చిట్కాలను పాటించవచ్చు.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top