![]() |
‘ప్యార్ కీ యే ఏక్ కహానీ’ సెట్స్ సాక్షిగా యూనిట్ సాక్షిగా.. ఏక్తాకపూర్ సమక్షంలో అనుకోని ఘోరంగా జరిగిపోయింది. సుకృతిని ప్రియావాల్ చెంప ఛెళ్లుమనిపించింది. ‘ప్యార్ కీ...’ సీరియల్‌లో సుకృతి ‘పియా’గానూ.. ప్రియావాల్ ‘మిషా’గానూ నటించటం తెలిసిందే. ఓ సన్నివేశంలో సుకృతి ప్రియా చెంప మీద ఒక దెబ్బ వేయాలి. ఇదే అదనుగా భావించిందో? లేక అనుకోకుండా జరిగిందో తెలీదుగానీ మొత్తానికి ప్రియ చెంప అదిరింది. ప్రియ మొహం కందగడ్డలా మారింది. కన్నీళ్లు ఒక్కటే తక్కువ. నటించమంటే ఏకంగా జీవిస్తే ఇటువంటి పొరపాట్లు దొర్లుతాయనటానికి ఇదొక తాజా ఉదాహరణ అంటూ యూనిట్ గుసగుసలాడింది. జరగాల్సిన పరిణామం అంతా జరిగింత్తర్వాత - ఎవరు ఏడ్చి మొత్తుకున్నా - దెబ్బ తిరిగి రాదుగా?! నా తప్పేం లేదు. ఏదో ఆవేశం కొద్దీ పాత్రలో ‘ఇన్‌వాల్వ్’ అయిపోవటంతో చేయి జారింది. దెబ్బ గట్టిగా తగిలింది. దీనికి ఇంత రాద్ధాంతం చేయటం అవసరమా? అంటూ సుకృతి.. మరోవైపు ప్రియ వాపోయారు.