![]() |
కావలసినవి : మైదాపిండి - 500 గ్రా పంచదార - 400 గ్రా వనస్పతి- 300 గ్రా ఏలకులు - ఆరు (పొడిచేయాలి) వంట సోడా - చిటికెడు మజ్జిగ - ఒక టేబుల్‌స్పూన్ రిఫైండ్ ఆయిల్ - తగినంత నెయ్యి - 100 గ్రా తయారి: మైదాపిండి, వనస్పతి, వంటసోడాలను ఒక పాత్రలో వేసి అందులో సరిపడినన్ని నీటిని పోసి ముద్దలా కలిపి రెండు గంటలసేపు నాననివ్వాలి. తరువాత పిండిని పలుచగా వత్తి దానిని రోల్ చేయాలి. రోల్ చేసిన తర్వాత అంచుని నీటితో తడిపి అతికేటట్లు చూడాలి. నిలువుగా కట్ చేసి మధ్యలో చపాతీ కరత్రో నొక్కాలి. వీటిని కాగిన నూనెలో వేసి గోధుమరంగులో వచ్చేంత వరకు వేయించి పక్కనపెట్టుకోవాలి. బాణలి లో పంచదారని సరిపడినన్ని నీళ్లతో కలిపి సన్నని సెగపై పాకం పట్టి అందులో ఏలకుల పొడి, నెయ్యి, వేయించి పెట్టుకున్న కాజాలు వేసి విడివిడిగా వచ్చేంత వరకు కలపాలి. అంతే! ఎంతో రుచికరమైన కరకరలాడే కాజాలు రెడీ. |