ఈ ఏడాది తెలుగులో ఏ హీరోయిన్ అగ్ర తాంబూలం అందుకోనున్నది? అని పరిశీలిస్తే.. అంతకుముందేడాది ‘జల్సా’తో, గతేడాది ‘కిక్’తో తన హవాను కొనసాగించిన ఇలియానా ఈ ఏడాది పూర్తిగా చతికిలపడిపోయింది. ఈ ఏడాది ఆమె నటించిన ‘సలీమ్’ పూర్తిగా నిరాశపరిచింది. ఇక 2009లో ‘మగధీర’తో అగ్ర స్థాయికి ఎగబాకిన కాల్‌కు కూడా ఆ తర్వాత ఆ స్థాయి విజయాలు లేవు. ఒకప్పుడు ఒక ఊపు ఊపిన త్రిషకు ఈ ఏడాది తెలుగులో విజయాలేమీ లేవు. నయనతార మాత్రం ‘అదుర్స్’, ‘సింహా’ చిత్రాలు సాధించిన విజయాలతో టాలీవుడ్‌లో తన స్థానం చెక్కుచెదరకుండా కాపాడుకోగలిగింది. శ్రీయ కూడా అంతే. ‘కొమరం పులి’ చిత్రంలో చేసిన ఐటం సాంగ్‌తో తన సొగసుల సత్తాను చాటుకుని, ‘డాన్ శీను’ చిత్రం సాదించిన విజయంతో ఇప్పట్లో టాలీవుడ్ నుంచి తాను నిష్ర్కమించేది లేదని ప్రకటించుకుంది.అయితే..
జెనీలియాకు కూడా ఈ ఏడాది ఏమాత్రం అచ్చి రాలేదు.భారీ అంచనాల నడుమ విడుదలెైన ‘ఆరెంజ్’ ఆమెకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. అలాగే హన్సిక పరిస్థితి కూడా అంతే. నితిన్‌తో ఈ భామ నటించిన ‘సీతారాముల కళ్యాణం’ విజయవంతం కాకపోవడంతో ఈ భామ స్థానం మరింత దిగజారింది. ఇక ఈ ఏడాదే పరిచయమై దూసుకుపోతున్న సమంతా, రిచా గంగోపాధ్యాయలు 2011లోనూ తమ హవాను కొనసాగిస్తే తప్ప.. వీరి పేర్లు నెంబర్ ఒన్ స్థానం కోసం పరిగణించలేం కాబట్టి.. ఈ ఏడాది కూడా ఈ కిరీటాన్ని అనుష్క శిరస్సుపెైనే అలంకరించకతప్పదు. సంఖ్యాపరంగా చూసినా, క్రేజ్‌పరంగా చూసినా హీరోయిన్లలో ఈ ఏడాది కూడా అనుష్కకే అగ్ర తాంబూలం ఇవ్వకతప్పదు!