![]() |
మొన్నటిదాకా వివాదాల సుడిగుండంలో దెబ్బమీద దెబ్బలు తిన్న నయనతార దాదాపు సినీ పరిశ్రమకు గుడ్‌బై చెప్పేసిందనుకున్నారు. ఒకానొక దశలో ప్రభుదేవా తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి నయనతారతో జీవితం పంచుకోనున్నట్లు సైతం ప్రకటించేశాడు. అయితే అన్నీ అనుకున్నట్లు జరగవు కదా...కోర్టు జోక్యంతో కథ అడ్డం తిరగడంతో దిమ్మదిరిగిన నయనతార మళ్లీ సినిమాలు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ చెప్పేసింది. అంతేకాదు గతంలో తాను మంచి లీడింగ్ దశలో ఉండగా వచ్చిన యాడ్ ఫిలింస్‌ను కూడా ఇప్పుడు ఒప్పేసుకుంటోంది. తాజాగా టాలీవుడ్లో బాపు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించనున్న ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో సీతాదేవి పాత్ర పోషించేందుకు సంసిద్ధమైంది. ఈ చిత్రమేగాక మరికొన్ని దక్షిణాది ఇతరభాషా చిత్రాల నిర్మాతలు కూడా నయనతార డేట్ల కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగులో వెంకటేష్ నటించే తాజా చిత్రంలో నయనతార నటిస్తున్నట్లు సమాచారం. కాగా టాలీవుడ్లో ఇప్పుడు నయనతార గురించి కోలీవుడ్‌లో ప్రేమాయణం ముగించి టాలీవుడ్లో రామాయణాన్ని కొనసాగిస్తోందని జనం గుసగుసలాడుకుంటున్నారు...