![]() |
కావాల్సిన పదార్థాలు:
అలసందలు లేక బొబ్బర్లు- ఒక కప్పు, కందులు- ఒక కప్పు, పెసలు- ఒక కప్పు, సెనగలు- ఒక కప్పు, మినుములు - ఒక కప్పు, బంగాళదుంప- పావుకేజీ, ఉల్లిపాయలు-4, పచ్చిమిర్చి-8, పొదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు,అల్లం, నూనె- తగినంతతయారుచేయు విధానం:
వడ చేయడానికి ఆరుగంటల ముందు బొబ్బర్లు, కందులు, పెసలు, సెనగలు, మినుములు, నానబెట్టుకోవాలి. బంగాళదుంప, ఉల్లిపాయలను తరిగి ఉంచుకోవాలి. నానబెట్టిన గింజలను గ్రైండర్లో వేసుకుని సగం నలిగిన తర్వాత అందులో సన్నగా తరిగిన అల్లం, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా పలుకులుగా రుబ్బుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీన, కరివేపాకు, బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని అరటి ఆకుమీద కానీ ప్లాస్టిక్ పేపర్ మీద కానీ వడలా ఒత్తుకుని వేడి నూనెలో దోరగా వేయించుకోవాలి. దీంతో పాంచ్దాల్ వడ రెడీ అయినట్లే.