ఒత్తిడిని అధిగమించేదెలా..? ఒత్తిడికి గల కారణాలు - హోమియో మందులు

నేటి పోటీ ప్రపంచంలో స్కూల్ పిల్లల నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వరకు అందరూ ఒత్తిడి బారిన పడుతున్న వారే. పెరిగిన పోటీ, యాంత్రికజీవనం, వ్యాయామలేమి ఇందుకు ప్రధాన కారణం. శారీరక, మానసిక ఒత్తిడి అధికం కావడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు వచ్చిపడుతున్నాయి. ఒత్తిడి చాలాకాలంగా ఉన్నప్పుడు శరీర స్పందన కూడా మారుతుంది. ఒత్తిడి కలిగినపుడు శారీరక స్పందన మూడు దశలుగా ఉంటుంది.

మొదటి దశ(అలారం) :

శరీరం ఒత్తిడి కారకంను ఈ దశలో గుర్తిస్తుంది. ఈ దశలో అడ్రినలిన్ ఉత్పత్తి అయి శరీరం పోరాడు  లేదా పలాయనం చిత్తగించు అనే ప్రతిచర్యకు సంసిద్ధం చేస్తుంది. కార్టిసాల్ ఉత్పత్తిని కూడా చైతన్యపరుస్తుంది.

రెండవ దశ (నిరోధం) : 
ఒత్తిడి కారకం ఇంకా ఉన్నా దానికి అలవాటుపడటానికి ప్రయత్నం జరుగుతుంది. పరిసరాలకు, అవసరాలకు అనుకూలంగా మారడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే పూర్తిగా అలవర్చుకోలేకపోవడం వల్ల దానికి సంబంధించిన సాధనములు క్రమంగా తగ్గిపోతాయి.

మూడవ దశ(అంత్యదశ):
ఈ దశలో శరీరం ఒత్తిడిని తట్టుకునే సాధనములు ఖర్చు కావడం వల్ల తన సాధారణ క్రియలను నిర్వహించలేకపోతుంది. అధిక చెమట, గుండె స్పందన రేటు పెరుగుదల వంటి అటానమిక్ నాడీ మండలంకు సంబంధించిన లక్షణములు కనిపిస్తాయి. అడ్రినలిన్ గ్రంథుల సామర్ధ్యం తగ్గుతుంది. రక్షణ వ్యవస్థ బలహీనమవుతుంది. దీనివల్ల డయాబెటిస్ రుమాటిజమ్ వంటి శరీరతత్వ సంబంధ వ్యాధులు, జీర్ణకోశ, గుండె సంబంధ వ్యాధులతో పాటు డిప్రెషన్, సైకోసిస్ వంటి మానసిక సంబంధ వ్యాధులు రావడానికి అస్కారం ఏర్పడుతుంది.

ఒత్తిడికి గల కారణాలు
బాహ్యకారణాలు :

  • జీవితంలో పెను మార్పులు
  •   పనిలో అధిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు
  •   బాహ్య సంబంధాలు,తీరిక లేకుండా ఉండే పని
  •   పిల్లలు, కుటుంబ బాధ్యతలు
అంతర్గత కారణాలు :
  •   అనిశ్చితమైన విషయములను అంగీకరించలేకపోవుట
  •   చెడు జరుగుతుందని అనుకోవడం
  •   సాధ్యం కాని అంచనాలు
  •   అన్నీ లోపరహితంగా చేయాలనుకోవడం
  •   తన భావం, వాదాన్ని సమర్థించుకోలేకపోవుట

ఒత్తిడిని కలిగించే సంఘటనలు
  •   జీవిత భాగస్వామి చనిపోవడం
  • విడాకులు, సమీపబంధువు మరణం
  •   గాయం, తీవ్ర అనారోగ్యం
  • ఉద్యోగంలో మార్పులు, ఉద్యోగ విరమణ
  •   లైంగిక సంబంధమైన కోరికలు తగ్గిపోవడం
  •   తరచు జలుబు చేయడం
ప్రవర్తనలో వచ్చే మార్పులు
  •   ఎక్కువ తినడం, తినకపోవడం
  •   ఇతరులకు దూరంగా ఉండటం
  •   బాధ్యతల పట్ల నిర్లక్ష్యం
  •   పొగతాగడం, మద్యంకు బానిసవ్వడం
ఒత్తిడి అధికంగా ఉందని సూచించే లక్షణాలు
  • జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు
  •   ఏకాగ్రత లోపం, నిర్ణయాలు చేసే శక్తి తగ్గుట
  •   అన్ని విషయాలలోనూ లోపములు చూచుట
  •   ఆందోళనకరమైన ఆలోచనలు, నిరంతరం బాధపడటం
ఆవేశ లక్షణాలు
  •   చిన్న విషయాలకు ఆవేశపడటం
  •   త్వరగా రిలాక్స్ కాలేకపోవడం
  •   బాధలో మునిగిపోయిన భావం, ఒంటిరిననే భావన
  •   భౌతిక లక్షణాలు
  •   నొప్పులు, అధిక విరేచనాలు, మలబద్ధకం
  •   వికారం, తలతిప్పుట
  • ఛాతీ నొప్పి, గుండె స్పందన రేటుపెరుగుట
ఒత్తిడి తగ్గించుకోవడమెలా...?
  •   రోజు వారి ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం బాగా ఉపకరిస్తుంది. వేగంగా నడవటం, ఇష్టమైన ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయి.

  • ఆకుకూరలు, తృణధాన్యాలు, పండ్లు, సోయాచిక్కుడు వంటి వాటిని మెనూలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.
  •   గంజాయి, సారాయి, ఆల్కహాల్ వంటి మత్తుపదార్థాలు, కేఫిన్ కలిగిన ఆహారపానీయాలకు దూరంగా ఉండాలి.
  •   శరీరానికి, మనసుకు తగినంత విశ్రాంతినివ్వడం మంచిది. సంతోషాన్నివ్వని పనిని తగ్గించుకోవాలి.
  •   ప్రాణాయామం ఎక్యూట్ స్ట్రెస్‌ను తగ్గించుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది. స్ట్రెస్‌ను మేనేజ్ చేయడానికి సహకరించే యోగా, మెడిటేషన్, హిప్నాటిజమ్ వంటి టెక్నిక్స్‌ను నేర్చుకుని సాధన చేయాలి.

హోమియో మందుల పనితీరు
ఒత్తిడిని ఎదుర్కొనే ప్రయత్నంలో శారీరక కణాలలో అనేక అనవసర రసాయనిక పదార్థాలు ఏర్పడటం మూలంగా రసాయనిక సమతుల్యత క్రమం మారుతుంది. ఈ స్థితిలోఅనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే హోమియో మందులు సహజ రక్షణ యంత్రాంగంను పటిష్టపరిచి, విషపూరిత పదార్థాలు విసర్జింపబడేటట్లుగా చేస్తాయి. దీనివల్ల శరీరంలో రసాయనిక సమతుల్యత పునరుద్దరింపబడి రోగి కోలుకుంటాడు. ఈ సమయంలో పోషకాహారం, విశ్రాంతి, వ్యాయామం ఎంతగానో ఉపకరిస్తాయి.

హోమియో మందులు
రోగి శారీరక, మానసిక లక్షణాలు, వ్యక్తిగత లక్షణాలను పరిశీలించి హోమియో మందులను ఎంపిక చేయడం జరుగుతుంది. రోగకారణం(స్ట్రెస్ కారక రకం) ఏదనే దానికి హోమియో విధానంలో అధిక ప్రాధాన్యం ఉంటుంది.
 

  • ఉద్రేకపూరితమైన ప్రవర్తనకు -అర్జెంటినమ్ నైట్రికమ్
  •   త్వరగా కోపం వచ్చే వారికి- నక్స్‌వామిక, స్టాఫిసాగ్రియ
  • దీర్ఘకాలిక విచారము వల్ల ఏర్పడిన డిప్రెషన్,యాంగ్జైటీకి -ఇగ్నీషియ, నేట్రంమూర్
  •   ఆకస్మిక భయం, షాక్ వల్ల వచ్చే రుగ్మతలకు- ఎకొనైట్
  • పని చేసే ముందు లేక మాట్లాడే ముందు వచ్చే భయం, ఊహాత్మక భయానికి- జెల్షీమియం
  •   యాంగ్జైటీ వల్ల వచ్చే అధిక విరేచనాలకు - జెల్షీమియం
  •   బాధ్యతలు, విచారం వల్ల వచ్చిన డిప్రెషన్‌కు- సెపియ
  •   జీవితం మీద విరక్తి, ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక అధికంగా ఉన్నప్పుడు-ఆరం మెటాలికమ్
మందుల ఎంపికలో ఆయా హోమియో మందులకు సంబంధించిన లక్షణములతో పాటుగా రోగి లక్షణములను కూడా సరిపోల్చుకోవాల్సి ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top