చల్లగాలి వెంటే వైరల్ జ్వరాలు - లక్షణాలు - వ్యాధి నిర్ధారణ - నివారణ

చల్లని వాతావరణం మనసుకు ఆహ్లాదాన్నయితే ఇస్తుంది. కానీ, ఈ చల్లదనానికి సూక్ష్మక్రిముల బారినుండి కాపాడే శరీర భాగాలు కొన్ని శక్తి హీనంగా మారిపోతాయి. ఫలితంగా సూక్ష్మక్రిములు చాలా సులువుగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే శీతాకాలంలో, వ ర్షాకాలంలో ఎక్కువ మంది వైరల్ జ్వరాలకు గురవుతుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలను అడ్డుకోవడం సాధ్యమేనంటున్నారు నిపుణులు...

శ్వాసనాళాల్లో ఒక అద్భుతమైన నిర్మాణం ఉంది. అది శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించాలని చూసే ఏ వైరస్‌నైనా తక్షణమే అంతమొందిస్తుంది. శ్వాసనాళాల్లో సన్నని దారంలా ఉండే సీలియా అనే విభాగాలు ఈ బాధ్యతను నిర్వహిస్తాయి. అయితే వాతావరణం కాస్త చల్లబడగానే ఈ సీలియాలు చతికి లబడతాయి. ఇదే అదనుగా వైరస్ శరీరంలోకి దూసుకుపోతుంది. దీని పరిణామమే జ్వరాలూ, రకరకాల అనారోగ్యాలు. వైరస్ మనిషిలోకి నేరుగానూ ప్రవేశించవచ్చు. లేదా వ్యాధి సోకిన వారిని కుట్టి, ఆ తరువాత అదే దోమ ఇతరులను కుట్టడం వల్ల కూడా ప్రవేశించవచ్చు.

లక్షణాలేమిటి ?
వైరస్ ద్వారా సంక్రమించే అన్ని వ్యాధుల్లోనూ లక్షణాలు ఒకేలా ఉంటాయి. జలుబు, దగ్గు, ఒంటినొప్పులు, కళ్లు ఎర్రబారడం, చలి, జ్వరం వంటి సామాన్య లక్షణాలే అందరిలోనూ కనిపిస్తాయి. కాని, ఒక్కోవైరస్ ఒక్కో ప్రత్యేక వ్యాధిని కలిగిస్తుంది. ఉదాహరణకు జాపనీస్-బి వైరస్ సోకితే ప్రత్యేకించి చిన్నపిల్లల్లో మెదడు ప్రబావితమై మూర్ఛలు రావచ్చు. వైరల్ అపటైటిస్ సోకితే కాలేయం ప్రభావితమై కామెర్లు రావచ్చు. అలాగే రెస్పిరేటరీ వైరస్ ద్వారా న్యూమోనియాకు గురికావచ్చు. నిజానికి 60 శాతం వైరస్ సమస్యలు మనలోని రోగ నిరోధక శక్తితోనే తగ్గిపోతాయి. మిగతా 40 శాతమే శరీరాన్ని రోగగ్రస్తం చేస్తాయి.

వ్యాధి నిర్ధారణ ఎలా?

రక్తపరీక్షల ద్వారానే వ్యాధిని నిర్ధారించవచ్చు. అరుదుగా ఎవరో ఒకరిద్దరు వైరల్ జ్వరాల బారిన పడినప్పుడు సాధారణ పరీక్షలే సరిపోతాయి. అలాకాకుండా జనం ఒకేసారి పెద్దసంఖ్యలో జ్వరాలబారిన పడుతున్నప్పుడు ఎలక్ట్రోమైక్రో స్కోప్ పరీక్షలు చేయవలసి ఉంటుంది.

రెండోసారి రాదు
ఒక రకం వైరల్ జ్వరానికి గురైన వ్యక్తి తన జీవిత కాలంలో మరెప్పుడూ అదే వైరస్‌కు గురికావడం ఉండదు. అంతకు ముందు తనను బాధించిన వైరస్‌ను ఎప్పటికీ మరిచిపోని మెమొరీ సెల్స్ మనిషిలో ఉండడమే ఇందుకు కారణం. రెండవసారి అదే వైరస్ తన లోకి ప్రవేశించాలని చూసినప్పుడు శరీరంలోని సీలియాలు వాటి మీద దాడి చేసి వాటిని చంపేస్తాయి. అందువల్ల ఒకసారి ఏదైనా వైరస్ కారణంగా అనారోగ్యానికి గురైన వ్యక్తి రెండవ సారి అదే వైరల్ జ్వరానికి గురయ్యే పరిస్థితే రాదు.
ఐదు రక్షక వ్యవస్థలు 

శరీరంలోని ఒక్కోరకం కణజాలం ఒక్కోరకం శత్రువర్గాన్ని ఎదుర్కొంటాయి. వాటిలో న్యూట్రోఫిల్స్ అనేవి బ్యాక్టీరియాను చంపేస్తాయి. అలాగే లింఫోసైడ్స్, మోనోసైడ్స్ వైరస్‌ను, యీస్నోఫిల్స్ అలర్జీకారకాలను, లేసోఫిల్స్ కాన్సర్ కారకాలను నిరో«ధిస్తాయి. అయితే వైరస్‌ను ఎదుర్కోవడానికి శరీరంలో ఇన్ని రకాల వ్యవస్థలు ఉన్నప్పుడు మనిషి ఎందుకిలా రోగాల బారిన పడ తాడనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. వాస్తవమేమిటంటే, శ రీరంలోని ఈ రక్షణ వ్యవస్థలు అందరిలోనూ అంత చైతన్యవంతంగా ఉండవు. దానికి పోషకాహార లోపాలు, అవసరమమైన నీరు, నిద్ర, వ్యాయామాలు లేకపోవడం వంటివి ప్రధాన కార ణాలు. రోగనిరోధకంగా పనిచేసే తెల్లకణాలు శక్తివంతంగా పనిచేయాలంటే ఈ లోపాలేవీ ఉండకూడదు.

నివారణ ఎలా?

  •   పెద్దవారికి వైరస్ సోకినప్పుడు అది జలుబు, దగ్గుతోనే ఆగిపోవచ్చు. పిల్లల్లో అయితే ఈ వైరస్, శ్వాసకోశాలు, మెదడుపై కూడా దాడి చేస్తుంది. అందుకే వైరల్ జ్వరం సోకిన పిల్లలను డాక్టర్ వద్దకు తీసుకు వెళ్లడంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. కాకపోతే ఇంకా పూర్తిగా ఎదగని పిల్లల్లో వైరస్ ఎక్కువ సమయం ఉండదు. అందుకే పిల్లలు ఎంత త్వరగా జబ్బున పడతారో అంతే త్వరగా కోలుకుంటారు.
  • డెంగీ ఫీవర్, మలేరియా ఇవేవీ మనిషి నుంచి మనిషికి నేరుగా వచ్చేవి కావు. వ్యాధిగ్రస్తులను కరిచిన దోమలు ఇతరులను కరవడం ద్వారానే ఈ సమస్యలు వ్యాపిస్తాయి. అందువల్ల దోమల నిర్మూలనకు కుటుంబపరంగానూ, సామూహికంగానూ చ ర్యలు తీసుకోవలసి ఉంటుంది.


  • పిల్లలు శీతాకాలంలో ఎక్కువగా వాంతులు విరేచనాలకు గురిచేసే డయేరియా బారిన పడుతుంటారు. పరిస్థితి విషమించకముందే వీరికి అవసరమైన వైద్య చికిత్సలు అందించడం శ్రేయస్కరం. 
  • వాతారణ కాలుష్యాలతో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. ఇది వైరస్ దాడికి సులువవుతుంది.అందుకే సాధ్యమైనంత వరకు పిల్లలు కాలుష్యాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి.
  • కలుషితమైన నీరు డయేరియాకు దారి తీస్తుంది కాబట్టి కాచి వడబోసిన నీరే తాగాలి. 
  • మశూచితో పాటు ఫ్లూ, మమ్స్ వ్యాధులకు కూడా టీకాలు వచ్చాయి. అందువల్ల పిల్లలకు టీకాలు ఇప్పించడంలో నిర్లక్ష్యం చేయకూడదు.  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top