ఛాన్స్ దొరికితే కొంగు బంగారమే!

మాటీవీ మహిళల కోసం సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు ‘కొంగు బంగారం’ అంటూ లైవ్ షోను కొత్తగా ప్రారంభించింది. ఈ షోలో పాల్గొనాలంటే ముందుగా ఎస్‌ఎంఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ గానీ ఐవిఆర్‌ఎస్ ద్వారా వాయిస్ రికార్డింగ్ గాని చేసుకోవాలి. అలా చేసుకున్న వారికి షో టైమ్‌లో యాంకరింగ్ చేసే గాయత్రి భార్గవి ఫోన్ చేస్తుంది. అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోని వారు షోలో పాల్గొనడానికి షో టైమ్‌లో ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది.

ఎస్‌ఎంఎస్ ద్వారా పాల్గొన్న వారిలో ఇద్దరికి.. ఫోన్ ద్వారా పాల్గొన్న వారిలో ఇద్దరికి.. ఐవిఆర్‌ఎస్ ద్వారా ఇద్దరికి షోలో పాల్గొనే ఛాన్స్ దక్కుతుంది. ఈ షోకి యాంకరింగ్ చేయడంలో గాయత్రి భార్గవి జోష్‌గానే కనిపిస్తుంది. షో ఆఖరిలో ఎస్‌ఎంఎస్‌ల ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారిలో ఒకరికి 2 గ్రాముల గోల్డ్ ఎనౌన్స్ చేయడం కాస్త ఊరట కలిగిస్తుంది. వారంలో షోలో పాల్గొని విజేతలుగా నిలిచిన వారిలో ఒకరికి వారాంతంలో లక్కీ డిప్ ద్వారా బంపర్ ప్రైజ్ ఉంటుందని కూడా ఎనౌన్స్ చేయడం జరిగింది. టోటల్‌గా విజేతలకు ఈ షో కొంగు బంగారమే! అవకాశం రాని వారి మాత్రం రీఛార్జ్‌ల రూపంలో పెనుభారమనే చెప్పాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే విన్నర్ కావాలంటే ఎక్కువ ఛాన్స్‌లు తీసుకోండని వారికి బదులు ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఇలా ఎక్కువసార్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే లాభమెవరికి? అనేది ఆడేవారికే తెలియాలి.
 
షో ఫార్మేట్ విషయానికి వస్తే స్క్రీన్‌పై చిత్రాలు స్క్రోల్ అవుతూ ఉంటాయి. వాటి వెనుక బంగారం.. వెండి.. ఇతర హోం నీడ్స్.. మొదలైన ఐటమ్స్ దాగి ఉంటాయి. యాంకర్ ఆ రోజు షోలో ఏయే ఐటమ్స్ ఉన్నాయో ముందుగా చెబుతుంది. ఇక ఛాన్స్ దక్కించుకున్న పార్టిసిపెంట్ వాటిలో దేనినైనా కోరుకోవచ్చు. అప్పుడు వారు కోరుకున్నది ఏ చిత్రం వెనుక దాగి ఉందో గెస్ చేయాలి. ఆ గెస్ కరెక్ట్ అయితే దానిని ‘కొంగు బంగారం’ అంటూ యాంకర్ వారికి ఇచ్చేస్తుంది. ఒకవేళ కోరుకున్నది ఆ చిత్రం వెనుక రాకపోతే మరో చిత్రాన్ని యాంకర్ సహాయంతో కోరుకోవచ్చు. అప్పుడు కూడా కోరుకున్నది రాకపోతే షోలో పాల్గొన్నందుకు గాను ఒక చీరను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి పార్టిసిపెంట్‌కి నష్టమైతే లేదు. ప్రస్తుతం టీవీలకే పరిమితమైపోయే ఆడవాళ్లను సీరియళ్ల నుండి తమవైపు తిప్పుకోవడంలో మధ్యాహ్న సమయంలో దాదాపు అన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లోనూ బహుమతులు అందించే రియాలిటీ లైవ్‌గేమ్ షోలు రన్ అవుతున్నాయి. రియాలిటీ షోల రేటింగ్ పెంచుకోవడానికి అతిథులను ఆహ్వానించే ఛాన్స్ లైవ్ షోల్లో లేకపోవడంవల్ల సాధారణ టీవీ ప్రేక్షకులు ఎక్కువగా బహుమతులు గెలుచుకోవడానికి అవకాశం దక్కుతుంది. ‘కొంగు బంగారం’ షోలో పార్టిసిపెంట్స్ మొదట బంగారం కోసం ఆశ పడటం కొసమెరుపు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top