గొబ్బెమ్మల పాటలు



గొబ్బియలో గొబ్బియలో
దున్ను దున్ను దున్నారట ఏమి దున్ను దున్నారట


1 . రాజ వారి తోటలో జామ దున్ను దున్నారట
    అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లార
    భామల గౌరీ గొబ్బియలో                                                       "గొబ్బి"


2. విత్తనం విత్తనం వేసారంట ఏమి విత్తనం వేసారంట 
     రాజ వారి తోటలో జామ విత్తనం వేసారంట
      అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లార   
      భామల గౌరీ గొబ్బియలో                                                     "గొబ్బి"

౩.   కొమ్మ కొమ్మ వేసిందంట  ఏమి కొమ్మ వేసిందంట 
     రాజ వారి తోటలో జామ కొమ్మ వేసిందంట
      అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లార   
      భామల గౌరీ గొబ్బియలో                                                     "గొబ్బి"
  
4 .  చిగురు చిగురు వేసిందంట ఏమి చిగురు వేసిందంట 

     రాజ వారి తోటలో జామ చిగురు వేసిందంట
     అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లార   
      భామల గౌరీ గొబ్బియలో                                                     "గొబ్బి"
  
5 .  ఆకు ఆకు వేసిందంట ఏమి ఆకు వేసిందంట
     రాజ వారి తోటలో జామ ఆకు వేసిందంట
      అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లార   
      భామల గౌరీ గొబ్బియలో                                                     "గొబ్బి"
  
6 . మొగ్గ మొగ్గ వేసిందంట ఏమి మొగ్గ వేసిందంట
    రాజ వారి తోటలో జామ మొగ్గ వేసిందంట
    అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లార   
      భామల గౌరీ గొబ్బియలో                                                     "గొబ్బి"

7 .పువ్వు పువ్వు  వేసిందంట ఏమి పువ్వు  వేసిందంట
     రాజ వారి తోటలో జామ పువ్వు  వేసిందంట
     అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లార   
      భామల గౌరీ గొబ్బియలో                                                     "గొబ్బి"

8 .  పిందె పిందె వేసిందంట ఏమి పిందె వేసిందంట
      రాజ వారి తోటలో జామ పిందె వేసిందంట
      అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లార        
      భామల గౌరీ గొబ్బియలో                                                    "గొబ్బి" 


                                                

9 . కాయ కాయ  వేసిందంట ఏమి కాయ వేసిందంట
    రాజ వారి తోటలో జామ కాయ వేసిందంట
    అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లార   
      భామల గౌరీ గొబ్బియలో                                                     "గొబ్బి"

10 . పండు పండు వేసిందంట ఏమి పండు వేసిందంట 
      రాజ వారి తోటలో జామ  పండు వేసిందంట 
      అవునాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లార   
       భామల గౌరీ గొబ్బియలో                                                    "గొబ్బి"


                        సుబ్బి గొబ్బెమ్మ
 సుబ్బి గొబ్బెమ్మ సుబ్బి నీయ్యవే
అరటి పండు వంటి అమ్మ నీయ్యవే
నారింజ కాయంటి నాన్న  నీయ్యవే
చామంతి పువ్వుంటి చెల్లెలు నీయ్యవే
తమల పాకంటి  తమ్ముడ్ని  నీయ్యవే
బంతి పువ్వంటి  బావా  నీయ్యవే
మొగలి పువ్వంటి మొగుడ్ని నీయ్యవే 
సుబ్బి గొబ్బెమ్మ సుబ్బి నీయ్యవే.



                                   ఆటవె స్తలములు ఆడేడమ

ఆటవె స్తలములు ఆడేడమ 
శర సంధ్య ఆటలు ఆడేడమ 


1 . గుంట గుంట తవ్వేదమ సరే  గోళి ఆటలు అదేడమ 

2 . చింత పిక్కలు ఆడేడమ సర సిరి సిరి నవ్వులు నవ్వేదమ 
౩. చల్లని గంధం తిసేడమ సర సఖాయ మెడలో రాసేదమ 

4 . సన్న జాజులు గుచ్చేదమ సర సంధ్య మెడలో వేసదమ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top