![]() |
కావలసిన పదార్థాలు :
అమెరికన్ కార్న్(ఉడికించినది)-ఒక కప్పువేగించిన పాప్‌కార్న్- అర కప్పు
మంచినీళ్లు-నాలుగు కప్పులు
పాల క్రీమ్-ఒక టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్
పాలు-అరకప్పు
కార్న్‌ఫ్లోర్-ఒక టీస్పూన్
దాల్చిన చెక్క-చిన్న ముక్క
లవంగాలు-రెండు
టమాటా సాస్-ఒక టేబుల్‌స్పూన్
బటర్-ఒక టేబుల్ స్పూన్
మిరియాల పొడి-ఒక టీస్పూన్
కొత్తిమీర-ఒక టీస్పూన్
ఉప్పు-తగినంత.
తయారు చేసే విధానం :
ఒక గిన్నెను స్టవ్‌పై ఉంచి, నీళ్లు పోసి అందులో ఉప్పు వేయాలి. మరో బాణలి స్టవ్‌పై ఉంచి అందులో కొద్దిగా బటర్ వేసి అది వేడెక్కాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగించి సూప్ వాటర్‌లో కలపాలి. దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత చల్లని పాలలో కార్న్‌ఫ్లోర్ కలిపి ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న నీటిలో కలిపి, కాసేపయ్యాక వేగించిన పాప్‌కార్న్ కూడా వేసి సూప్ కొద్దిగా చిక్కబడ్డాక దించేయాలి. చివర్లో మిరియాల పొడి, పాల క్రీమ్, కొత్తిమీర చల్లి వేడి వేడిగా సర్వ్ చేయాలి.