కండక్టర్ ఉద్యోగానికి అపాయింట్‌మెంట్........

వెంగళప్పకి చాలా కోరికలు ఉన్నాయి. అవి తీరే మార్గం కనిపించడం లేదు. దేవుని అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. కొన్ని రోజులకు దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు...
వెంగళప్ప : స్వామీ! నా బ్యాగు నిండా ఎప్పుడూ డబ్బులు ఉండేలా చూడు.
దేవుడు : ఇంకా ...
వెంగళప్ప : ఎప్పుడూ పెద్ద వాహనంలో తిరిగేలా చూడండి ...
దేవుడు : సరే...
వెంగళప్ప: చివరిగా చిన్న కోరిక... ఆ వాహనంలో అమ్మాయిలు కూడా ఉండేలా చూడు స్వామీ...
దేవుడు : తథాస్తు... నీవు ఇంటికెళ్ళు, రెండు రోజుల్లో అవన్నీ సమకూరుతాయి.
వెంగళప్ప ఇంటికెళ్ళిన రెండోరోజు పోస్ట్ వచ్చింది... హడావుడిగా కవర్ ఓపన్ చేసి చూసేసరికి... కండక్టర్ ఉద్యోగానికి అపాయింట్‌మెంట్ లెటర్ ఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top