ఆన్‌లైన్‌లో ఉద్యోగం వెతుకుతున్నారా? అయితే జర జాగ్రత్త!

మీరు ఇంటర్నెట్‌లో ఉద్యోగం కోసం అప్లై చేద్దామనుకుంటున్నారా? ఆన్‌లైన్‌లోనే పని చేద్దామనుకుంటున్నారా? అప్పుడు డబ్బు లావాదేవీలు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే తప్పులో కాలేసినట్లే. అలా జాగ్రత్తగా ఉండేందుకు, మిమ్మల్ని హెచ్చరించేందుకు ఒక నివేదిక తయారైంది. ఇంటర్‌నెట్‌లో భద్రత కోసం సాఫ్ట్‌వేర్ రూపొందించే యూనిఫైడ్ థ్రెట్ మానేజ్‌మెంట్(యూటీఎం) సొల్యూషన్స్ వారు థ్రెట్ ల్యాండ్‌స్కేప్ రిపోర్ట్ పేరిట ఒక నివేదిక రూపొందించారు.

ఉద్యోగార్థులకు ఉద్యోగాలు ఎరవేసి సైబర్ నేరగాళ్లు బాగా డబ్బు సంపాదిస్తున్నారని అం దులో తేల్చారు. ఇలా ఆన్‌లైన్‌లో అక్రమాలకు పాల్పడే వారిని 'మనీ మ్యూల్స్' అని పిలుస్తున్నారు. ఆయా కార్యకలాపాలను జూయెస్ ఆపరేషన్స్ అని చెబుతారు. అందుకే పేమెంట్ ప్రొసెసింగ్ ఏజెంట్, మనీ ప్రోసెసింగ్ ఏజెంట్, మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ కావాలని యాడ్ వస్తే నమ్మవద్దని నివేదికలు చెబుతున్నాయి.

ఉద్యోగం కోసం ఆత్రంగా ఎ దురు చూసే వారే ఇలాంటి వారి బారిన పడుతుంటారు. వారి ఆతృత ను ఆసరాగా చేసుకుని వారి నుంచి డబ్బు గుంజడమో లేదా అక్రమం గా సంపాదించిన మొత్తాన్ని, అమాయకులను ఉపయోగించుకుని దేశాల సరిహద్దులు దాటించడమో సైబర్ నేరగాళ్లు చేస్తుంటారు. అం దుకే నగదుకు సంబంధించి 'ప్రాసెసింగ్' ఏజెంట్లు కావాలని ఈ మెయిల్‌కు ఏమైనా ప్రకటనలొస్తే ఆచితూచి వ్యవహరించాలని నివేదికలు చెబుతున్నాయి.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top