![]() |
ఆపిల్స్ - రెండు
నూడిల్స్ - ఒక కప్పు
క్యాబేజీ తురుము - ఒక కప్పు
పచ్చి బఠాణీలు- అరకప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చి చిక్కుడు గింజలు - అర కప్పు
క్యారెట్ తురుము - అర కప్పు
నూనె - సరిపడా
టమోట సాస్ - నాలుగు స్పూన్లు
మిరప పొడి - ఒక స్పూన్
వెనిగర్ - ఒక స్పూన్
ఉప్పు - తగినంత.
తయారుచేయు విధానం
ముందుగా నూడిల్స్‌ను కొంచెం ఉప్పు కలిపిన నీటిలో వేసి చిన్న మంటపై ఉడికించుకోవాలి. తరువాత నూడిల్స్‌ను తీసి పక్కన పెట్టుకోవాలి. బఠాణీలను, చిక్కుడు గింజలను కూడా ఉప్పు కలిపిన నీటిలో ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, చిక్కుడు గింజలను వేసి దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి.
ఆపిల్ ముక్కలను కూడా వేసుకోవాలి. తరువాత అందులో నూడిల్స్, బఠాణీలను వేసి రెండు, మూడు నిమిషాలు ఫ్రై అయ్యాక కొంచెం వెనిగర్, టమోట సాస్ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఉప్పు, మిరపపొడి వేసి దింపుకోవాలి. అంతే...ఆపిల్ నూడిల్స్ రెడీ.