చాట్‌ చట్నీలు తయారుచేసుకుందామా...


గ్రీన్‌ చట్నీ: 
 అరకప్పు కొత్తిమీర తురుము, అరకప్పు కొబ్బరితురుము రెండు పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసి మిక్సీలో రుబ్బాలి. చివరగా రెండు చుక్కల నిమ్మరసం పిండితే గ్రీన్‌చట్నీ రెడీ. కొత్తిమీర బదులు పుదీనా కూడా వేసుకోవచ్చు.
 రెడ్‌ చట్నీ:  
5 ఎండుఖర్జూరాలు, నిమ్మకాయంత చింతపండు తీసుకుని తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తరవాత మెత్తగా రుబ్బి ఉప్పు, కారం కలిపితే రెడ్‌చట్నీ రెడీ. కావాలనుకుంటే కాస్త నూనెతో తాలింపు కూడా వేసుకోవచ్చు. 
స్వీట్‌ టామరిండ్‌ చట్నీ: 
రెడ్‌చట్నీకి కాస్త బెల్లం లేదా పంచదార చేరిస్తే స్వీట్‌ చట్నీ తయార్‌.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top