కావలసిన పదార్థాలు:
టమాటాలు - ఆరు
నూనె - పావుకప్పు
కారం - ఐదుచెంచాలు
ఉప్పు - రుచికి సరిపడా
మెంతులు - అరచెంచా
చింతపండు - కొద్దిగా
ఆవపిండి - అరచెంచా.తయారీ:
టమాటాముక్కల్ని సన్నగా తరిగిపెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి టమాటాముక్కలు, చింతపండును వేయాలి. సన్ననిమంటపై ఉంచి.. ముక్కల్లోని తేమ పోయేదాకా బాగా మగ్గించాలి. ఇప్పుడు మెంతుల్ని దోరగా వేయించి.. మెత్తగా పొడి చేసుకోవాలి. మెంతిపొడి, తగినంత ఉప్పు, కారం కలిపి మరో ఐదునిమిషాలుంచాలి. దింపేముందు ఆవపిండి కలిపితే సరిపోతుంది.నోరూరించే ఇన్స్టంట్ టమాటా వూరగాయ సిద్ధం. ఇది నాలుగైదురోజుల దాకా నిల్వ ఉంటుంది.
ఇన్స్టంట్ టమాటా వూరగాయ
teluguLifestyle Editor
6:57:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో గత కొన్నేళ్లుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.