ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌ను ఇక మీరు పళ్లబుట్టలో పెట్టుకోవచ్చు.పేరొందిన ఉద్యానవనశాస్త్రవేత్త హాజి కలీముల్లాఖాన్ కొత్త రకం జామను రూపొందించారు. దీనికి ఐశ్వర్యారాయ్ పేరు పెట్టారు.
ఇది యాపిల్ మాదిరి ఉంటుంది. మరింత తీపిగా ఉంటుంది.గుజ్జుకూడా అధికంగా ఉంటుంది.
ఇది రుచి వాసన చూపులలో భిన్నంగా ఉంటుందని సాంప్రదాయికజామ కానే కాదని కలీముల్లా చెప్పారు.
ఇందులో విత్తనాలు మెత్తగా ఉంటాయన్నారు. మామూలుజామలో విత్తనాలు పళ్లసందుల్లో ఇరుక్కుపోతాయి.
దీన్ని అభివృద్ధి చేసేందుకు తనకు 8 సంవత్సరాలు పట్టిందన్నారు. సేంద్రియ పదార్ధాలతోనే అభివృద్ధి చేసినట్లు చెప్పారు. క్రిమిసంహారిణిగా వేపనూనెను వినియోగించినట్లు వెల్లడించారు.
మీ పళ్లబుట్టలో ఐశ్వర్యారాయ్
teluguLifestyle Editor
6:10:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో గత కొన్నేళ్లుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.