'గగనం' లోటుపాట్లు


'గగనం' చిత్ర విశేషాల్లోకి వస్తే.... 
'గగనం' చిత్రం ద్వితీయార్ధంలో ఒక పాత్ర ఇలా ఉంటుంది... ''దేశంలో తీవ్రవాద దాడులు లాంటి ఇతివృత్తంపై తర్కానికి కట్టుబడి తీసే సినిమాలు భారతీయ ప్రేక్షకులకు రుచించవు''
పైవాదనకు కాస్తో కూస్తో అర్ధముంది. కానీ 'గగనం' చిత్ర కథాగమనం తడబడటానికి కారణమైన అనేక పొరపాట్లలో అది కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఐసీ-814 విమానం హైజాక్‌ ఆధారంగా అల్లుకున్న కథలో అనేక లోపాలున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హైజాక్‌ ఉదంతం. తీవ్రమైన భయభ్రాంతులకు గురి చేస్తూ దృశ్యబద్ధం చేయాల్సిన ఆ ఉదంతాన్ని తెరకెక్కించటంలో అలాంటి ప్రయత్నమేది చేసినట్టు కనపడదు. 

అలాగని 'గగనం' చిత్రంలో ఆకట్టుకునే సన్నివేశాలు కూడా లేకపోలేదు. హైజాక్‌ డ్రామాలో కొన్ని సన్నివేశాలు మినహాద్వితీయార్ధాన్ని సాగదీయకుండా ఉత్కంఠభరితంగా రూపొందించటంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. నేషనల్‌ సెక్యూరిటీ గార్ట్స్‌ కమాండర్‌గా నాగార్జున చిత్రానికి ఊపిరి పోశాడు.

కాంధహార్‌ హైజాక్‌ వ్యవహారంతో సమర్ధమంతంగా వ్యవహరించటంలో అసమర్ధ నిర్ణయం నుంచి ఓటు బ్యాంక్‌ రాజకీయాలు, రెడ్‌ టేపిజమ్‌, స్వార్ధ ప్రయోజనాల వరకు చిత్రంలో పలు పాత్రలు భారత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసినప్పటికీ దర్శకుడు కథను చెప్పటంలో ఎక్కడా తడబడలేదు. 

అయితే 'గగనం' మంచి ఉద్దేశంతో రూపొందించినప్పటికీ పూర్తిగా సత్తా ప్రదర్శించలేక ఒక మోస్తరు చిత్రంగా మిగిలిపోయింది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top