చాక్లెట్‌లో ఇష్టపడే ఫ్లేవర్‌ని బట్టి మనిషి వ్యక్తిత్వం

చాక్లెట్లంటే ఇష్టపడనివాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఏదో ఒక సమయంలో చాక్లెట్ రుచి చూడని వారుండరు. చిన్నారులకే కాదు పెద్దవాళ్లకు కూడా నోరూరించే చాక్లెట్లు నోరు తీపి చేయడమే కాదు... మనసులోని భావాలను కూడా చెబుతాయంటున్నారు నిపుణులు. చాక్లెట్‌లో వాడే ఫ్లేవర్‌ని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చట. ఒక్కోరకం చాక్లెట్‌ను ఇష్టపడేవాళ్లు ఒక్కోరకమైన ఆలోచనా ధోరణిని కలిగివుంటారంటున్నారు. కొన్ని రకాల చాక్లెట్లు అందించే విశేషాలు ఇవే.

  •  చాక్లెట్ ఫ్లేవర్‌ను ఇష్టపడేవారు ఎక్కువ ప్రాక్టికల్‌గా ఉంటారు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేస్తారు. వీరిలో సృజనాత్మకత ఎక్కువ. కొత్త కొత్త ఆలోచనలతో రోజును ప్రారంభిస్తారు. పాజిటివ్ థింకింగ్ వీరి ఎస్సెట్. ఏ పని చేసినా ఏకాగ్రతతో, శ్రద్ధగా చేస్తారు.
  •   స్ట్రాబెరీ ఫ్లేవర్‌ను ఇష్టపడేవారు మంచి మాటకారులు. వారి ఛలోక్తులతో ఇతరులకు దగ్గరవుతారు. అదృష్టం పైన ఆధారపడకుండా కష్టాన్నినమ్ముకుంటారు. ఆసక్తి ఉంటే తప్ప ఏ పనీ ముట్టుకోరు. అవగాహన పెంచుకునే వరకు దేని జోలికీ వెళ్లరు. అందరిలో ప్రత్యేకంగా కనిపించడానికి ఇష్టపడతారు.
  •   కాఫీ ఫ్లేవర్‌ను ఇష్టపడే వ్యక్తులు సదా ఆందోళనతో కనిపిస్తుంటారు. ఉత్సాహంగా ఉంటారు. యుక్తిపరులు. ఎంత క్లిష్ట సమస్యనైనా సులువుగా పరిష్కరించగల సామర్థ్యం ఉంటుంది. చాలా త్వరగా ఒత్తిడికి గురవుతుంటారు. కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా ఉంటుంది.
Share on Google Plus