ప్రపంచంలోని విలాసవంతమైన అయిదు లగ్జరీ హోటళ్ళు గురించి తెలుసుకుందామా... ..


సామాన్యుడు మామూలు హోటల్‌కు వెళ్ళడమంటేనే అదనపు ఖర్చుగా భావిస్తాడు. అటువంటిది ఏ ఐదు నక్షత్రాల హోటలో అంటే దాన్ని ఒక లగ్జరీగా పరిగణిస్తాడు. అటువంటిది వీటిని తల దన్నే లగ్జరీ హోటళ్ళంటే మాటలు కాదు. ఇవి లక్షాధికారులకు కూడా కొన్ని సందర్భాల్లో అందుబాటులో ఉండవు.ఎందుకంటే ఈ హోటల్లో బస చేయడం కోటీశ్వరులకే సాధ్యం..! అద్భుతమైన విలాస మందిరాలుగా తీర్చిదిద్దిన ఈ హోటళ్లలో కాలు పెడితే అన్ని విలాసాలు, సుఖాలను అనుభవించవచ్చు.ప్రపంచంలోని విలాసవంతమైన ఇటువంటి అయిదు లగ్జరీ హోటళ్ల గురించి తెలుసుకుందామా... 



బుర్జ్‌ అల్‌ అరబ్‌...
ప్రపంచంలో నే అత్యంత విలా స వంతమైన హోట ల్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దేశంలో ఉంది. మధ్య ప్రాచ్య దేశాల్లో ఉన్న ఈ హోటల్‌ నేడు లగ్జరీ హోట ళ్లలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. జుమె రాహ్‌ బీచ్‌ ఒడ్డున ఈ భారీ హోటల్‌ను నిర్మించారు. బుర్జ్‌ అల్‌ అరబ్‌ లో బస చేయడం ఓ ఖరీదైన అనుభవం. ఈ హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేసుకున్న అతిథు లకు రాచ మర్యాదలు లభిస్తాయి. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే అతిథులను పికప్‌ చేయడానికి గ్రాండ్‌ స్టైల్‌ను అసరిస్తారు హోటల్‌ నిర్వాహకులు. ఖరీదైన గదిని బుక్‌ చేసుకున్న వారిని ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఏకంగా హెలికాప్టర్‌లో ఆకాశ మార్గాన తీసుకెళ్లి హోటల్‌లో దించు తారు. మిగతావారినైతే ఖరీదైన రాల్స్‌ రాయిస్‌ కారులో కూర్చో పెట్టుకొని హోటల్‌కు తీసుకెళ్తారు.

ఇక ఈ హోటల్‌లోని అల్‌ మహారా రెస్టారెంట్‌లో డిన్నర్‌ కోసం రిజర్వేషన్‌ చేసుకున్నవారిని విం త అనుభూతి కలుగుతుంది. ఈ రెస్టారెంట్‌కు సముద్రంలోని నీట ిగుండా సబ్‌మెరైన్‌లో తీసుకెళ్తారు. ఇందులో ప్రయాణించడం మధు రానుభూతే అంటారు అల్‌ మహారా రెస్టారెంట్‌లో డిన్నర్‌ చేసిన వారు. ఈ హోటల్‌ ప్రపంచంలోనే ఎతె్తైన నాలుగవ భారీ కట్టడంగా ప్రఖ్యాతి గాంచింది. దీని ఎత్తు 1,053 అడుగులు. ఇక బుర్జ్‌ అల్‌ అరబ్‌ హోటల్‌ను కృత్రిమ ద్వీపంపై అద్భుతంగా నిర్మించారు. ఈ ద్వీపం విస్తీర్ణం 280 మీటర్లు.
 

జుమెరాహ్‌ బీచ్‌కు సమీపంలో ఈ ద్వీపం ఉంది. ఈ ద్వీపం నుంచి బీచ్‌కు వెళ్లేందుకు ప్రైవేట్‌ కర్వింగ్‌ బ్రిడ్జిను అందంగా నిర్మించారు. 1994లో బుర్జ్‌ అల్‌ అరబ్‌ హోటల్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ హోటల్‌ను సౌతాఫ్రికా కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్టర్‌ ముర్రే, రాబర్ట్‌లు కలిసి నిర్మించారు. దీన్ని జుమెరాహ్‌ గ్రూప్‌ వారు నిర్వహిస్తున్నారు. ఇక ఈ హోటల్‌ను 28 డబుల్‌ స్టోరీ ఫ్లోర్లతో నిర్మించారు. ఇందులో విలాసవంతమైన 202 బెడ్‌రూమ్‌ సూట్‌లు ఉన్నాయి. ఆర్కిటెక్చరల్‌ అద్భుతంగా రూపుదిద్దుకున్న బుర్జ్‌ అల్‌ అరబ్‌ ప్రపంచంలోనే ఒకే ఒక్క సెవెన్‌ స్టార్‌ హోటల్‌గా పేరు గాంచింది.

పాల్మ్స్‌ కేసినో రిసార్ట్‌..

లాస్‌వెగాస్‌ నగరంలో విలాసవంతమైన హోటల్‌ పాల్మ్స్‌ కేెసినో రిసార్ట్‌. లాస్‌ వెగాస్‌ను సందర్శించే పర్యాటకులు ఈ హోటల్‌ను బయట నుంచి తిలకించేందుకు ఇష్టపడతారు. అందమైన భారీ కట్ట డంగా ఈ లగ్జరీ హోటల్‌ రూపుదిద్దుకుంది. ఇందులో 95వేల చద రపు అడుగుల అతిపెద్ద కేెసినో ఉంది. ఇందులో హాయిగా ఎంజాయ్‌ చేయవచ్చు. ఈ హోటల్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో రాత్రి పూట సరదాగా గడిపేందుకు ఎన్నో నైట్‌ క్లబ్బులు ఉన్నాయి.వీటిలో స్వర్గ సుఖాలను అనుభవించవచ్చని నిర్వాహకులు చెబు తారు. పాల్మ్స్‌ లో ప్రత్యే కంగా ప్రపం చంలోనే ఒకే ఒక్క ప్లేబాయ్‌ నైట్‌ క్లబ్‌ ఉంది.40 అంత స్తుల ఈ హోటల్‌ ఫాంటసీ టవర్‌గా ప్రఖ్యాతిగాంచింది.తమ విడిది మరింత రసవత్త రంగా ఉండాలనుకునే వారి కోసం ఖరీదైన ఎరోటిక్‌ సూట్‌, హాట్‌ పింక్‌ సూట్‌, క్రిబ్‌ సూట్‌లను ఇక్కడ ఏర్పాటు చేశారు.

హోటల్‌ రిట్జ్‌...

రొమాంటిక్‌ సిటీగా పేరుగాంచిన ప్యారిస్‌లో ఏర్పా టైంది హోటల్‌ రిట్జ్‌. ఈ హోటల్‌లో బస చేసేవారికి ఖరీదైన అనుభవం ఎదురవుతుంది. ఫ్రెంచ్‌ స్టైల్‌లో దీన్ని లగ్జరీగా నిర్మించారు. ఇందులో 10 ప్రతిష్టాత్మకైన సూట్‌లు ఉన్నాయి. కోకో చానెల్‌ సూట్‌, రుడాల్ఫ్‌ వాలెంటైనో, ఎల్టన్‌ జాన్‌ సూట్‌, కింగ్‌ ఎడ్వర్ట్‌ 7 సూట్‌లు ఎంతో విలాసవంతమైనవి. రిట్జ్‌ హోటల్‌లోని హెమింగ్‌వే బార్‌లో అందించే కాక్‌టైల్స్‌ మజాయే వేరంటారు మద్యం ప్రియులు. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకారం ప్రపం చంలోనే గ్రేటెస్ట్‌ బార్‌ టెండర్‌గా పేరుగాంచిన కాలిన్‌ పిఫీల్డ్‌ ఈ బార్‌లో ఉన్నారు. ఆయన అందించే మధురమైన కాక్‌టైల్స్‌ను ఆ స్వాదించేందుకు పలువురు ఇక్కడికి వస్తుంటారు. ఆయన వైన్‌ కాక్‌టైల్స్‌ను పసందైన కాంబినేషన్లలో అందిస్తుంటారు.రిట్జ్‌ సెల్లా ర్‌లో 35 వేల బాటిళ్ల స్టాక్‌ ఎప్పటికీ సిద్ధంగా ఉంటుంది. వీటిలో 1812 కాలం నాటి మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయట...!

కెంపిన్‌స్కి గ్రాండ్‌ హోటల్‌ డెస్‌ బెయిన్స్‌...
సుందరమైన స్విట్జర్లాండ్‌ దేశంలో కొలువైంది కెంపిన్‌స్కి గ్రాండ్‌ హోటల్‌ డెస్‌ బెయిన్స్‌. లెజెండరీ మారిషన్‌ ఫౌంటేన్‌ల వద్ద దీన్ని అందంగా నిర్మించారు. ప్రపంచం లోనే విలాసవంతమైన స్పాలకు కేంద్రంగా ఈ హోటల్‌ పాపులారి టీ సంపాదించింది. ఈ స్పాలలో వెరైటీగా స్టోన్‌ మసాజ్‌, హెర్బల్‌ స్టీ మ్‌ బాత్‌లను ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. వేసవిలో అతిథులతో కిటకిటలాడే ఈ హోటల్‌లో ప్రత్యేకంగా కాస్మటిక్‌ సర్జరీ చేస్తారు. ఇది సెలబ్రిటీల కోసం క్లినికల్‌ ట్రీట్‌మెంట్‌గా పేరొందింది. పలువురు సెలబ్రిటీలు కాస్మటిక్‌ సర్జరీ కోసం ప్రత్యేకంగా స్విట్జర్లాండ్‌కు విచ్చేసి కెంపిన్‌స్కిలో కొద్ది రోజలు పాటు బస చేస్తారు.

గ్రాండ్‌ రిసార్ట్‌ లగోనిస్సీ...

ఏథెన్‌న్స్‌లో ఏర్పాటైంది విలాసవంతమైన గ్రాండ్‌ రిసార్ట్‌ లగో నిస్సీ. బీచ్‌లో ఏర్పాటైన ఈ హోటల్‌లో షాంపేన్‌ను ఆస్వా దించడం మధురానుభూతి అంటారు ఈ హోటల్‌లో గడిపినవారు. వాటర్‌ స్పోర్ట్స్‌ ఫ్యాన్స్‌ కోసం ఇక్కడ స్కూబా డైవింగ్‌ సెంటర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హాయిగా సేదతీరేందుకు సముద్రపు ఒడ్డున జెన్‌ క్లబ్‌ను విలాసవంతంగా తీర్చి దిద్దారు. ఇందులో అందమైన స్విమ్మింగ్‌ పూల్‌తో పాటు అత్యాధునిక జిమ్‌ను ఏర్పాటుచేశారు. ఇక్కడ సై్పసీగా అందించే రుచికరమైన స్నాక్స్‌ టేస్టే వేరని భోజన ప్రియులు సెలవిస్తారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎం త డబ్బుకి అన్ని సుఖాలు దొరుకుతాయన్న మాట.    
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top