అరగుండు.. ఆయిల్ జిడ్డు బట్టతలలకు బురిడీ న్యూజెన్ పేరిట ఘరానా మోసం

హైటెక్కుతో రోడ్‌సైడ్ బిజినెస్ఆయుర్వేదం ముసుగులో దోపిడీజుట్టు పెరగలేదు కానీ.. ఉన్నది ఊడింది!
గగ్గోలు పెడుతున్న ఆయిల్ బాధితుఉలఇది వైద్యం కాదన్న నిపుణులుజుట్టు రావడానికి మందుల్లేవని స్పష్టీకరణహెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషనే మార్గం.


బట్టతల. ఇప్పుడు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య. పెరుగుతున్న ఒత్తిళ్లు.. మారుతున్న జీవన శైలితో ముప్పైవ పడిలోనే బట్టతల బారిన పడిపోతోంది యువత. శాస్త్రీయంగా చెప్పాలంటే బట్టతల మీద జట్టు మొలిపించాలంటే ఒక్క హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారానే సాధ్యం. కానీ.. ఖర్చుతో కూడుకున్న పని. దీన్నే టీవీ5 యాజమాన్యం సావకాశంగా తీసుకుంది.

రోడ్డు పక్క మూలికా వైద్యుడి అవతారం ఎత్తింది. నాలుగు రోడ్ల కూడలికి బదులు.. మంచి భవంతిలో దుకాణం తెరిచారు. ఓ ఆయిల్‌ను మార్కెట్‌లోకి వదిలారు. కీచుగొంతు వినిపించే మైకు స్థానంలో తమ సొంత టీవీలో స్టీరియోఫోనిక్‌లో గ్రాఫిక్స్‌తో ప్రచారం ఊదరగొట్టారు. 'ఇలా ఉన్న మీ బట్ట తల.. అలా జుట్టు తలగా మారిపోతుంది..' అంటూ టీవీలో భవిష్యత్తు చూపించారు. ఆ ఆయిల్ పేరు న్యూజెన్. కొత్త తరం కోసం కొత్త బురిడీ!  



న్యూజెన్ కత్తికి రెండు వైపులా పదునుంది. జుట్టు లేకపోతే మొలిపిస్తుంది. జుట్టు ఉంటే రాలకుండా ఆనకట్ట కట్టేస్తుంది. బట్టతల ఉన్న వాళ్లు 10 నుంచి పన్నెండు వారాలు ఈ ఆయిల్ రాసుకుంటే చాలు.. జుట్టే జుట్టు! నమ్మి.. రాసుకున్నారా.. బోడి గుండే! ఇది దీనిని వాడిన వారు స్వయంగా చెప్పిన మాట. తాను ఐదు నెలల పాటు ఆరు బాటిల్స్‌ను వాడానని, కానీ తన బట్టతలలో కించిత్ మార్పు కూడా లేదని ఓ వినియోగదారుడు వాపోయారు. 
 
ఉత్పత్తిదారులు సూచించిన అన్ని విధానాలను నిక్కచ్చిగా పాటించానని అయినా ఫలితం లేకపోయిందని చెప్పారు. పైగా ఆ జిడ్డు, హైదరాబాద్ కాలుష్యం కారణంగా మరింత పాడై.. తల స్నానం చేసినప్పుడు జుట్టు రాలడం మరింత పెరిగిందని చెప్పారు. వీటికి తోడు జేబు కూడా ఖాళీ అయిందన్నారు. తాను ఆ ఆయిల్ రాస్తే.. ఉన్నది కూడా ఊడిపోతోందని మరో వినియోగదారుడు తెలిపారు. ఈ ఆయిల్ రాయడం వల్ల ఉన్న జట్టు పాడై.. కాలిపోయినట్లు తయారైందని, దానితో తలకు కర్చీఫ్ కట్టుకుని తిరగాల్సి వస్తోందని మరో యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు.  


ఆయుర్వేదంతో సంబంధం ఉందా?
బట్టతలపై జుట్టు మొలిపించడం మహా మహులకే సాధ్యం కాలేదు. నిజానికి ఈ కంపెనీ ఉత్పత్తిలో అంత 'సరుకు' ఉందా? ఇంతటి 'ప్రతిష్ఠాత్మక' ఔషధం తయారు చేసిన కంపెనీ ఎన్నాళ్ల నుంచి ఉంది? దీని తయారీకి మూలికలను హిమాలయాల్లోని మానస సరోవరం నుంచి వెలికి తెచ్చారా? ఈ కంపెనీ పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుంటే.. వీరికీ ఆయుర్వేదానికీ ఏమిటి సంబంధం అనే అనుమానం రాక మానదు. న్యూజెన్ హెర్బల్ ప్రైవేట్ లిమిటడ్.. 2009 డిసెంబర్‌లో రిజిస్టర్ అయిన సంస్థ. రిజిస్టరయిన ఏడాదిలోనే తొలి ప్రొడక్ట్‌ను మార్కెట్‌లోకి తెచ్చేసింది. 


అదే న్యూజెన్ గోల్డ్ హెర్బల్ ఆయిల్. ఆయుర్వేద రహస్యాలను ఛేదించేశామని గప్పాలు కొట్టుకుంటున్న ఈ సంస్థ.. ఏ నల్లమల  
ఈ ఆయిల్ ఎన్నేళ్ల పరిశోధన అని చెబితే వారి వద్ద సమాధానం లేదు. పరిశోధనల తీరుతెన్నులు అడిగితే బిక్కముఖమే. ఎవరి అనుమతులు ఉన్నాయంటే దిక్కులు చూడటమే! ఏ ప్రశ్నకూ ఈ కంపెనీ దగ్గర సమాధానాల్లేవు. వాస్తవానికి ఇటువంటి హెర్బల్ ఆయిల్స్‌ను పరీక్షించే సౌకర్యం మన దేశంలోనే లేదు. పైగా ఇవి డ్రగ్స్ కంట్రోల్ పరిధిలోకి రావు. ఇదే వారి మోసానికి వెసులుబాటైంది.
  

  • బట్టతలపై జుట్టు మొలిపించేందుకు ఆయుర్వేదంలోగానీ, హోమియోపతి, అల్లోపతి వైద్యంలో గానీ నిర్ధారణ జరిగి, ఆమోదం పొందిన ఆయిల్స్ ఏమీ లేవు. ఇటువంటి ఆయిల్స్ జట్టు మొలిపిస్తాయనడం అంటే జనాన్ని మోసం చేయడమే. ఇది చట్టరీత్యా నేరం. వెంట్రుకలు ఊడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిని గుర్తించి.. సంబంధిత కేసును బట్టి చికిత్స ఉంటుంది తప్పించి.. అన్ని రకాల బట్టతలలకూ ఒకే మందు అనడం జనాన్ని మభ్య పెట్టడమే.

  • ఆయుర్వేదం అని ట్యాగ్ పెట్టుకున్న ప్రతిదీ ఆయుర్వేదం కాదు. మూలికలు అని చెప్పుకున్న ప్రతి ఉత్పత్తి ఆయుర్వేదం కాదు. కేవలం చికిత్సతోనే జట్టు వచ్చేస్తుందని ఆయుర్వేదంలో కూడా ఎక్కడా చెప్పలేదు. ఆ వ్యక్తి లోపాన్ని బట్టి బట్టతల ఉంటుంది. దానిని గుర్తించి తగిన చికిత్స ఇవ్వాలి. అందరికీ ఒకే తైలం అనడం వైద్యం కాదు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top