మందులతో వయసు తగ్గించవచ్చా?

యాంటీ ఏజింగ్ డ్రగ్స్ విషయంలో చాలా రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల జీవనశైలిలో వస్తున్న మార్పుల వల్ల వయసు మీరకముందే వయస్సు మీద పడినట్ల నిపిస్తోంది. అందుకు కారణం మనలో చాలామందికి ఆరోగ్య స్పృహ ఉండదు. ప్రధానంగా ఐదు అంశాలు ఏజింగ్‌కు దోహదపడతాయి. వయసు మీదపడడానికి ముందే వృద్ధాప్యం లక్షణాలు కనిపించకుండా ఉండాలంటే ఈకింది ఐదు అంశాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఆహారం: 
శరీరంలోని విషపదార్థాలు, ఫ్రీరాడికల్స్ శుభ్రం అయ్యేందుకు దోహదపడే ఆహారం తీసుకోవడం. అంటే... ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండే డైట్ తీసుకోవాలి.
క్రమం తప్పని వ్యాయామం: 
నిత్యం వ్యాయామం చేయడం వల్ల శరీరాన్ని దీర్ఘకాలం పాటు యంగ్‌గా ఉంచేందుకు అవసరమైన హార్మోన్లు స్రవిస్తాయి. అంతేకాదు... మనసును సంతోషంగా ఉంచే, నొప్పిని నివారించడానికి దోహదపడే ఎండార్ఫిన్స్ వంటి రసాయనాలు స్రవిస్తాయి.
అలవాట్లు: 
పొగతాగడం, గుట్కా, ఆల్కహాల్ వంటి అలవాట్లు వయసు పైబడినట్లుగా కనిపించేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వాటిని తక్షణం మానేయాలి.
మానసిక శిక్షణ:  
పాజిటివ్ ఆలోచనలు, ధ్యానం (మెడిటేషన్) వంటి ప్రక్రియలతో ఒత్తిడిని దూరంగా ఉంచుకోవడం వల్ల యంగ్‌గా కనిపించడం సాధ్యమవుతుంది.
మెడికేషన్ అండ్ సప్లిమెంట్స్: 
ఒకవేళ అవసరాన్ని బట్టి చికిత్స ప్రక్రియల్లో భాగంగా మందులు ఉపయోగించాల్సి వస్తే అవి పై అంశాల తర్వాతే. హార్మోన్ థెరపీ, యాంటీఆక్సిడెంట్ సప్లిమెంట్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి వాడాల్సి ఉంటుంది. అయితే వీటిని చికిత్సలో భాగంగా ఇవ్వాల్సివచ్చినప్పుడు మెడికల్ స్పెషలిస్టులు, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top