మనశ్శాంతికి మార్గాలు

1.ఏ విషయం పట్ల అయినా స్పష్టత ఉన్నప్పుడు ఒత్తిడి ఉండదు. అందుకే ముందు మీ గమ్యం పట్ల స్పష్టత ఉండాలి. స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుంటే దాన్ని సాధించే మార్గాలు బోలెడు కనిపిస్తాయి.

2.ఎంత డబ్బు సంపాదించామన్న దానికన్నా ఎంత మంచి పేరు తెచ్చుకున్నామన్నదే ముఖ్యం. మంచితనంతో అందుకునే గౌరవాభిమానాలు డబ్బు కన్నా ఎక్కువ మనశ్శాంతినిస్తాయి.

3.ఎన్ని ముఖ్యమైన పనులున్నా అప్పుడప్పుడూ కొంత గ్యాప్ ఇవ్వడం మంచిది. అవిశ్రాంతంగా పనిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. రిలాక్స్ కావడం వల్ల మరింత చురుగ్గా పనిచేయగలుగుతాం.

4.యాంత్రికంగా బతికేస్తే మజా ఉండదు. కొన్ని రోజులకే బోరింగ్ వస్తుంది. ప్రతీ పనిలో, ఆలోచనలో సృజనాత్మకత ఉండాలి. ఎవరికి వారే యమునాతీరే అని కాకుండా నలుగురితోనూ సత్సంబంధాలు పెంచుకోవాలి.

5.అవసరంలో ఉన్నవాళ్లకు సాయం చేయడానికి ముందుండాలి. ఇతరుల కోసం పనిచేసినప్పుడు కలిగే సంతృప్తి అందించే మనశ్శాంతి మాటల్లో చెప్పలేం.


6. అన్ని సందర్భాల్లో పాజిటివ్‌గా, చిరునవ్వుతో ఉండాలి. ఏ పరిస్థితిలోనైనా సానుకూల అంశాల కోసం వెతకాలి. నెగటివ్‌ని పక్కన పెట్టినప్పుడే సంతోషంగా ఉండగలుగుతాం.

7. మంచి ఆహారపు అలవాట్లు, జీవనవిధానం ఆరోగ్యాన్నే కాదు.. మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడతాయి.

8. కాస్తంత ఆధ్యాత్మిక చింతన అలవరచుకుంటే మనసుకెంతో ఊరటగా ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top