వంటింట్లో ఉండే వస్తువు లతో క్లెన్సర్స్, స్క్రబ్స్, మాయిశ్చరైజర్స్, టోనర్లు తయారు చేసుకుందామా.....

బాడీలోషన్లు, క్లెన్సర్‌లు, స్క్రబ్స్, సన్‌స్క్రీన్లు, మాయిశ్చరైజర్లు, యాస్ట్రింజెంట్లు లేదా టోనర్లు ఇలా స్కిన్ కేర్ కోసం కుప్పలుతెప్పలుగా ఎన్నో బ్యూటీప్రొడక్ట్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. డబ్బులుపోసి వాటిని కొని వాడడం మొదలుపెట్టిన తరువాత వాటిలో వాడిన రసాయనాల వల్ల చర్మం పాడవుతోందని గుర్తిస్తున్నాం. అప్పుడు డబ్బూపోయే.. అందమూ పోయే.. అంటూ డాక్టర్ల దగ్గరకు పరుగెత్తాల్సిన పరిస్థితి. ఇలా కాకుండా ఉండాలంటే మీ బ్యూటీ కిచెన్ తలుపుతట్టాల్సిందే.

లెన్సర్స్
  •   పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లం, చెరకులో ఉండే గ్లైకోలిక్ ఆమ్లం, ద్రాక్షల్లో ఉండే టార్టారిక్ ఆమ్లం అద్భుతమైన ఫేషియల్ క్లెన్సర్స్‌గా పనిచేస్తాయి.
  •   ఆలివ్ లేదా నువ్వుల నూనెల్ని మేకప్ తొలగించుకునేందుకు వాడొచ్చు. 
  • స్ట్రాబెర్రీల్లో సహజసిద్ధమైన సాల్సిలిక్ఆమ్లం ఉంటుంది. ఇది యాక్నెని నివారించడంలో బాగా పనిచేస్తుంది.   

స్క్రబ్స్
  •   కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసిన ఓట్‌మీల్ అన్ని రకాల చర్మాలకు ఫేషియల్ క్లెన్సర్‌గా పనికొస్తుంది. 
  • ఎండపెట్టి గ్రైండ్ చేసిన కమలాపండు లేదా నిమ్మతొక్కలు, ఆల్మండ్స్ కూడా సున్నితమైన స్క్రబ్‌లా పనికొస్తాయి. 
  •  వాల్‌నట్‌పొడి, తేనె, నిమ్మకాయరసాల్ని ఒక్కో టీస్పూను చొప్పున తీసుకుని కలిపి స్క్రబ్‌గా వాడొచ్చు.

మాయిశ్చరైజర్స్
పొడిచర్మానికి...
మిగలపండిన అరటిపండు గుజ్జు, అవకాడో, బొప్పాయి, గుడ్డు పచ్చసొన మాయిశ్చరైజర్లుగా పనిచేస్తాయి. గసగసాలు, పల్లీగింజల్లో సహజసిద్ధమైన నూనెలు ఉంటాయి. అందుకని వీటి పేస్ట్‌ను పూసుకుంటే ముఖచర్మం మెరుస్తూ ఉంటుంది. అలాగే నిర్జీవంగా ఉన్న చర్మానికి పెరుగు రాసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.

జిడ్డు చర్మానికి...
గుడ్డులో తెల్లసొన వాడితే జిడ్డుచర్మం మెరుగవుతుంది. మెంతులు, కందిపప్పుల్ని కలిపి పేస్ట్ చేసి చర్మంపై రాసుకుంటే జిడ్డు తొలగిపోతుంది.
 
యాస్ట్రింజెంట్లు లేదా టోనర్లు
  •  కీరదోసకాయ, పైనాపిల్ (అనాసపండు), నిమ్మరసాలు ప్రకృతి ఇచ్చిన యాస్ట్రింజెంట్లు. ఇంట్లో వీటిని వాడే ముందు ముఖానికి ఆవిరిపట్టాలి. ఇలాచేయడం వల్ల ముఖంపై రంధ్రాలు తెరుచుకుని శుభ్రమవుతాయి. దీనివల్ల పోషకాలు సులభంగా చర్మంలోకి ప్రవేశించే వీలుంటుంది.
  •   మృదువైన, పట్టులాంటి చర్మం కావాలంటే స్నానానికి ముందు బేకింగ్‌సోడాను ఒంటికి పట్టించండి. ఇదే ముఖంపై ఉండే బ్లాక్‌హెడ్స్ నివారణకు కూడా ఉపయోగపడుతుంది.
  •   బాహుమూలాల్లో, పాదాల్లో దుర్వాసన వస్తుంటే కనుక వెనిగర్ బాగా పనిచేస్తుంది. వెనిగర్, నీళ్లు సమపాళ్లలో కలిపి డియోడరెంట్‌లకు బదులు వాడొచ్చు. అథ్లెట్స్ ఫుట్‌తో బాధపడేవాళ్లు వెనిగర్ ఫుట్‌బాత్ చేయడం వల్ల ఆ ఇబ్బంది పూర్తిగా పోతుంది.
  • పసుపు చేసే లాభాలు అందరికీ దాదాపు తెలిసినవే. కాని పసుపు కంటికింద ఉండే నల్లటి చారల్ని, ఉబ్బును కూడా తొలగిస్తుందని చాలామందికి తెలియదు. పగిలిన మడమలను బాగుచేస్తుంది. పిగ్మెంటేషన్, ముడుతల్ని పోగొడుతుంది. చర్మానికి మెరుపునిస్తుంది.
  •   సన్‌బర్న్ బారినపడ్డ చర్మానికి ఆలివ్‌నూనె వాడాలి.
  •   గోరువెచ్చటి ఆలివ్‌నూనెలో గోళ్లను ముంచితే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రెడీమెడ్‌గా లభిస్తున్నాయి కదాని రసాయనాలతో కూడిన ఉత్పత్తులు వాడకుండా ఇంట్లో లభించే సౌందర్యసాధనాలు వాడడం వల్ల సొగసంతా మీ చేతుల్లో ఉంటుంది. ఇలా చేస్తే ఖర్చు తగ్గడంతో పాటు అందం, ఆనందం మీ చెంతే ఉంటాయి.               
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top