రోల్డ్ ఆమ్లెట్


కావలసిన పదార్థాలు: గుడ్లు - రెండు, బ్రెడ్ ముక్కలు - రెండు, బీన్స్ ముక్కలు - ఒక టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు - రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు - రెండు, మిరియాల పొడి - అర టీ స్పూను, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.

తయారుచేయు విధానం: ముందుగా గుడ్డు సొనని మిక్సీలో వేసుకోవాలి. ఒక గిన్నెలో సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బ్రెడ్ పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, మిరియాల పొడి, పసుపు, ఉప్పు, మిక్సీలో వేసిన గడ్డు సొన వేసి బాగా కలపాలి. స్టౌ మీద పెనం పెట్టి సరిపడా నూనె పోసి పలచగా ఆమ్లెట్ వేయాలి. ఆమ్లెట్ వేగాక గుండ్రంగా మడవాలి. దీన్ని టమోట సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top