నాగచైతన్య తాజా చిత్రం దడ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఈ రేంజి ప్లాప్ కి కారణం నాగార్జున,శివ ప్రసాద్ రెడ్డి అని తేల్చారు.నాగచైతన్య పూర్తి స్ధాయిలో సంతృప్తి చెంది దడని చేయలేదని,అతనికి స్క్ర్రిప్టు నచ్చలేదని చెప్తున్నారు.అయితే నాగార్జునకి ఆ కథ బాగా నచ్చటంతో తన కుమారుడికి కొత్త యాక్షన్ ఇమేజ్ వస్తుందని ఆశతో చేయించాడని ఆ ప్లాన్ రివర్స్ అయిందని అంతటా వినిపిస్తోంది.ఏమి మాయ చేసావే,100% లవ్ చిత్రాలు లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చాయని,దానిని ఎట్లా అయినా మార్చి మిగతా యంగ్ హీరోలకు పోటీగా నిలబెట్టాలనే నాగార్డున తాపత్రయమే సినిమాను ముంచిందని చెప్తున్నారు.అందులోనూ కామాక్షి బ్యానర్ పై చేసిన సినిమాలు వరసగా పోతున్న నేపధ్యంలో మరింత శ్రద్ద పెట్టాల్సింది పోయి కేవలం దర్శకుడుపై నమ్మకంతో వదిలేసాడని,అదే సినిమాను నాశనం చేసిందంటున్నారు.అందులోనూ అదే దర్శకుడు తీసిన గత చిత్రం హౌస్ ఫుల్ రిలీజ్ కూడా కాలేదని,అది తెలిసి కూడా నాగార్జున పట్టుపట్టి దడ చేయించాడని చెప్పుకుంటున్నారు.
దడ ఫ్లాపుకి కారణం నాగార్జునే
teluguLifestyle Editor
4:24:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.