మనసు ఉల్లాసంగా ఉంచడంలో రంగుల పాత్ర కీలకమే. మరి ఏ గదికి ఏ రంగు నప్పుతుందో చూద్దామా........

  • పడకగదికి పింక్ కలర్ చాలా అనుకూలమైనది. లేత నీలం, లేత ఆకుపచ్చ రంగులు కూడా బాగా నప్పుతాయి. పిల్లల పడకగదికి ఆకుపచ్చ రంగు వేయడం వల్ల ఉత్సాహంగా చదువుకుంటారు.
  •   పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులు లివింగ్ రూమ్‌కి బాగా నప్పుతాయి. ఇంటికి వచ్చిన అతిథులకు ఈ రంగులు కనువిందు చేస్తాయి.
  •   వంటగదికి తెలుపు రంగే మంచిది. పసుపు, నారింజ, రోజ్ పింక్, చాక్‌లెట్, రంగులను కూడా వేసుకోవచ్చు.
  • బాత్‌రూమ్ తెలుపు లేక తెలుపు-నలుపు, గ్రే కలర్స్ మిక్సింగ్ వేసుకున్నా బాగుంటుంది.
  •   డైనింగ్‌రూమ్‌కి పింక్, గ్రీన్, బ్లూ కలర్స్ బాగా నప్పుతాయి. ఈ రంగులు ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మనసును ఉత్సాహంగా ఉంచుతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top