బీట్‌రూట్‌తో.......దోశలు


కావలసిన పదార్థాలు:
  ఉప్పుడు బియ్యం - 3 కప్పులు, జీలకర్ర - 1 టీ స్పూను, అల్లం - అంగుళం ముక్క, ఎండుమిర్చి - 4, టమోటాలు - 3, క్యారెట్ ముక్కలు - అర కప్పు, బీట్ రూట్ ముక్కలు - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - కాల్చడానికి సరిపడా. తయారుచేసే విధానం:
ఉప్పుడు బియ్యం 3గంటల పాటు నానబెట్టాలి. మిక్సీలో జీలకర్ర, ఎండుమిర్చి, అల్లంతో పాటు నానిన బియ్యం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత టమోటోలు, క్యారెట్, బీట్‌రూట్ ముక్కల్ని కూడా గ్రైండ్ చేసుకోని బియ్యం రుబ్బులో కలిపి ఉప్పుని జతచేయాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై దోశలు పోసుకొని రెండువైపులా దోరగా కాల్చాలి. వేడి వేడిగా కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top