ఏ డ్రెస్‌కి ఎలాంటి ఆభరణాలు ధరించాలి?

సాధారణంగా మనం పార్టీలకు వెళ్లినప్పుడు చర్మ రంగును బట్టి ఆభరణాలను ఎంపిక చేసుకోవాలి. నల్లగా ఉన్నవారు వజ్రాభరణాలు ధరించకపోవడమే మంచిది. దీని వల్ల ఇంకా నల్లగా కనపడే అవకాశం ఉంది. అందుకని వైట్ స్టోన్స్ కాకుండా అన్‌కట్స్ వేసుకోవచ్చు. ఎమరాల్డ్, రూబీస్ కూడా వీరికి బాగుంటాయి. ముత్యాలు ధరించాలనుకుంటే మరీ తెల్లనివి కాకుండా క్రీమిష్ షేడ్ ఉన్నవి సెలక్ట్ చేసుకోవాలి. చామనఛాయ, నల్లగా ఉన్నవారికి టెంపుల్ జ్యూయలరీ, యాంటిక్ ఫినిష్ ఉన్న ఏ ఆభరణమైనా బాగుంటుంది. ఇక ఫెయిర్ కాంప్లెక్స్ ఉన్నవారు ఎంత బ్రైట్‌వైనా వేసుకోవచ్చు. లైట్ కలర్, డల్ కలర్స్ చీరలు ధరించినప్పుడు హెవీ జ్యూయలరీని ఎంచుకోవాలి. దీని వల్ల గ్రాండ్‌గా కనిపిస్తారు. శారీ హెవీగా ఉంటే జ్యూయలరీ సింపుల్‌గా ఉండాలి. ప్లెయిన్ శారీస్, చిన్న బార్డర్ ఉన్నవి ధరించినప్పుడు ఎక్కువ వరసలు ఉన్న ముత్యాల దండలు, పూసల దండలు, పెద్ద పెద్ద లాకె ట్స్,.. వేసుకుంటే బాగుంటుంది. కాటన్ శారీస్ కట్టుకున్నప్పుడు ఎనామిల్ పెయింట్ ఉన్న బంగారు ఆభరణాలు లేదా ఉడెన్, ప్లాస్టిక్ ఆభరణాలను ధరిస్తే బాగుంటుంది. ఇక మెడ కురచగా ఉన్నవారు నెక్లెస్ కాకుండా లాంగ్ చైన్లు, చెవులకు స్ట్రెయిట్‌గా ఉండే పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ మాత్రమే వాడాలి. మెడకు ఏవీ వేసుకోకపోయిన పర్వాలేదు. మెడ పొడవుగా ఉన్నవారు బ్రాడ్‌గా ఉండే నెక్లెస్‌లు, చౌకర్లు ధరించాలి. హెవీ ఎంబ్రాయిడరీ బార్డర్స్ ఉన్న చీరలు కట్టుకున్నప్పుడు చెవులకు మాత్రమే పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ పెట్టుకొని మెడకు ఏమీ అలంకరించుకోకుంటేనే బాగుంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top